Renu Desai: చాయ్‌వాలాకు నేనో అంధ భక్తురాలిని !! ధురంధర్ 2కు రేణు షాకింగ్ రివ్యూ..

Updated on: Mar 24, 2026 | 8:09 PM

"ధురంధర్ 2" సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ భారీ విజయం సాధించింది. రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లో 500 కోట్లు వసూలు చేసింది. సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమాపై రేణు దేశాయ్ చేసిన 'చాయ్‌వాలా జల్వా' పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆమె పోస్ట్‌లో ప్రధాని మోడీని, బీజేపీని సమర్థిస్తూ దేశభక్తి భావనను వ్యక్తం చేశారు, ఇది నెట్టింట చర్చనీయాంశమైంది.

ధురంధర్ 2 సినిమాపై రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది. సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ సినిమాను ఎగబడి మరీ చూస్తున్నారు. చూసిన తర్వాత తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా ధురంధర్ 2 సినిమా చూసిన రేణు దేశాయ్‌.. ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. తన ట్వీట్‌తో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఆదిత్యధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ ది రివెంజ్ సంచలనాలు సృష్టిస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ మూవీ కేవలం 3 రోజుల్లోనే 500 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్‌తో సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ధురంధర్ 2 రేంజ్ చూస్తుంటే 2000 కోట్ల టార్గెట్ ను ఈజీగా దాటేయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఈ సినిమాలో డైరెక్టర్ ఆదిత్య ధర్, రణ్ వీర్ సింగ్ పేర్లు మరోసారి నెట్టింట మార్మోగుతున్నాయి. కేవలం సామాన్యులే కాదు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు థియేటర్లకు వెళ్లి మరీ ధురంధర్ 2 సినిమాను చూస్తున్నారు. అనంతరం తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్, మహేశ్ బాబు, విజయ్ దేవరకొండ, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఎస్ఎస్ రాజమౌళి సహా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ధురంధర్ 2 ను చూసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. తాజాగా నటి రేణూ దేశాయ్ ధురందర్ ది రివేంజ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ పోస్టులు షేర్ చేశారు. ‘ఈ చాయ్‌వాలా భారతదేశానికి వచ్చినప్పటి నుంచి మన ప్రజలలో భయం పెరిగింది’ అంటూ ధురంధర్ 2 సినిమాలో బడే సాహెబ్ అలియాస్ దావూద్ ఇబ్రహీం చెప్పే డైలాగ్ కి సంబంధించిన రీల్ ని తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేశారు రేణూ దేశాయ్‌. తన పోస్టుకు ‘చాయ్‌ వాలా జల్వా’ అని క్యాప్షన్ ఇచ్చిన రేణూ .. తాను బీజేపీకి, మన అద్భుతమైన పీఎం మోదీజీకి గర్వించదగిన అంధ భక్తురాలిని అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. అంతేకాదు సొంత దేశం గురించి అర్థం పర్థం లేకుండా మాట్లాడితే, దయచేసి ధురందర్ 1 & 2 సినిమాలు చూడండి అంటూ రేణు దేశాయ్‌ సూచించారు. ధర్మాన్ని పాటించడమే అందరి కర్తవ్యమని.. ప్రతిఫలాన్ని ఆశించడం కాదని ఆమె తన పోస్టులో మెన్షన్ చేశారు. విజయమనే వాగ్దానానికి ఎవ్వరూ మోసపోవద్దని.. యుద్ధభూమి పిలుస్తోంది.. కార్యాచరణలో అందరూ ధైర్యంగా ముందుకు సాగాలంటూ.. రేణు తన పోస్టులో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి పోస్ట్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ustaad Bhagat Singh: ఫిల్మ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఉస్తాద్ టికెట్‌ రేట్ల పై బంపర్ ఆఫర్

వార్ ఎఫెక్ట్.. సిలిండర్‌‌లో ఇక 10 కేజీల గ్యాసేనా ??

తమిళ స్వాముల దౌర్జన్యం.. లక్ష ఇవ్వకపోతే శపిస్తాం

ఎవడ్రా వీడు.. మటన్‌ ఉడకలేదు.. పోలీస్ కేసు పెట్టాడు..

బరువు పెరిగితే.. జీతంలో కోత ?? ఇదేం రూల్ రా నాయనా..

Follow Us