ఆ మాంసం తినేవాడు రాముడిగా ఎలా నటిస్తాడు !! రణ్‌బీర్ పై హిందూ సంఘాల ఆగ్రహం

Updated on: Jul 10, 2025 | 9:05 PM

బాలీవుడ్ లో మరో భారీ బడ్జెట్ చిత్రం రామాయణం ముస్తాబవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ ఇటీవల విడుదలైంది. దీనికి ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో వీఎఫ్‌ఎక్స్ వర్క్స్ అద్భుతంగా ఉన్నాయంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక ఈ రామాయణంలో రణబీర్ కపూర్ రాముడి పాత్రను పోషిస్తున్నాడు.

అయితే గతంలో ఈ పాత్రకు రణ్‌బీర్‌ను ఎంపిక చేసినప్పుడు, కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనికి కారణం రణబీర్ కపూర్ పర్సనల్ లైఫ్ స్టైల్. అప్పట్లో స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కూడా కూడా రణబీర్ కపూర్ ఎంపికను వ్యతిరేకించింది. ఇక ఈక్రమంలోనే ఇప్పుడు ఈ సినిమాపై మరో వివాదం మొదలైంది. రీసెంట్‌గా రామాయణ గ్లింప్స్ నెట్టింట రిలీజ్ అయి.. అందర్నీ ఫిదా చేసి… సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచిన వేళ… రణ్‌బీర్‌కు సంబంధించిన మరో వీడియో కూడా దానికి సరిసమానంగా వైరల్ అయింది. ఆ వీడియోలో తనకు బీఫ్ తినడమంటే ఇష్టమంటూ రణబీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. అయితే ఈ వీడియోను చూపిస్తూ… కొంతమంది హిందూ సంఘాల నేతలు.. మరి కొంతమంది నెటిజన్లు… రణ్బీర్ కపూర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. బాలీవుడ్‌లో అసలు ఏం జరుగుతోంది? అంటూ నెట్టింట కామెంట్ చేస్తున్నారు. రామాయణ్‌ సినిమా నుంచి రణ్‌బీర్‌ను తొలగించాలని.. ఆయన బదులు మరో హీరోతో సినిమా రీ షూట్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఎవరో ఏదో తింటే అదో పెద్ద సమస్య చేస్తున్నారు అంటూ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఈ వివాదం హీట్ ను పెంచింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొడుకు తప్పుకు.. సారీ చెప్పిన స్టార్ హీరో

మనుషులకే దిక్కులేదంటే.. కుక్కకేమో గ్రాండ్‌గా బర్త్‌ డే పార్టీ…!

నాలుగో పెళ్లాం వచ్చిన వేళా విశేషం.. లాటరీ గెలిచిన నటుడు…

మళ్లీ నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. ఈసారి ఏకంగా.. !

‘అతను చనిపోవడమే బెటర్..’ ఉదయ్‌ చావుపై కౌషల్‌ షాకింగ్ కామెంట్స్