‘అతను చనిపోవడమే బెటర్..’ ఉదయ్ చావుపై కౌషల్ షాకింగ్ కామెంట్స్
90'sలో లవర్ బాయ్‌గా... వెండి తెరపై వెలిగిన ఉదయ్ కిరణ్.. చూస్తుండగానే ఫేడవుట్ అయిపోయాడు. సినిమాలను ఎంచుకోవడంలోనూ.. తన వ్యక్తిగత జీవితంలో సరైన నిర్ణయాలను తీసుకోవడంలోనూ తడబడ్డాడు. మానసికంగా సంఘర్షనకు గురయ్యాడు. చివరికి షాకింగ్ నిర్ణయం తీసుకుని తనువు చాలించాడు. తన ఫ్యాన్స్‌తో పాటే టాలీవుడ్‌ను కూడా అప్పట్లో ఉలిక్కిపడేలా చేశాడు.
ఇక అప్పటి నుంచి అప్పుడప్పుడు వినిపించే ఉదయ్‌కిరణ్ పేరు.. ఇప్పుడు ఉన్నట్టుండి బిగ్ బాస్ ఫేం కౌషల్ మంద కారణంగా నెట్టింట ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. ఉదయ్ కిరణ్ సూసైడ్ పై కౌషల్ మంద చేసిన ఒక్క కామెంట్ ఇప్పుడు మరో సారి ఉదయ్ చావు గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది. బిగ్ బాస్‌తో తెలుగు టూ స్టేట్స్‌లో పాపులర్ అయిన కౌషల్ మంద.. రీసెంట్ హిట్ కన్నప్ప సినిమాలోనూ మంచి రోల్ చేశాడు. ఇక ఈ క్రమంలోనే ఓ షోకు వెళ్లిన కౌషల్.. హీరో ఉదయ్ కిరణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఉదయ్ గురించి మాట్లాడుతూ… చనిపోవడమే బెటర్ అంటూ చెప్పేశాడు. సినిమాల్లోకి రాకముందు నుంచే ఉదయ్ తనకు తెలుసని చెప్పిన కౌషల్… అప్పట్లో ఆయన బేగంపేటలో ఉండేవాడన్నాడు. ఎంతో కష్టపడి ఎదిగాడని.. కానీ ఇండస్ట్రీలో ఎదుగుతుంటే చాలా మంది ఓర్వలేకపోయారన్నాడు. పైకి ఎదిగే వాడిని కిందకు లాగడం ఇక్కడున్న కొంత మంది నైజం అని చెప్పిన కౌషల్.. ఈ క్రమంలోనే ఉదయ్‌ను ఎంతో మానసికంగా హించారని చెప్పుకొచ్చాడు. ఉదయ్ పడుతున్న టార్చరని దగ్గరుండి మరీ చూశానని.. ఆ టార్చర్ అనుభవించడం కంటే చనిపోవడమే బెటర్ అంటూ.. ఒక్క సారిగా చెప్పేశాడు కౌషల్. తన కామెంట్‌తో అందర్నీ అవాక్కయ్యేలా చేశాడు. అంతేకాదు చనిపోయిన తర్వాతైనా తన ఆత్మకు శాంతి కలుగుతుందని ఆశిస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు. తన మాటలతో మరో సారి ఉదయ్ చావు గురించి నెట్టింట మరోసారి రచ్చ రగిల్చాడు కౌషల్ మంద.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆలియాకు టోకరా వేసిన PA.. పోలీసులకు పట్టించిన హీరోయిన్
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతున్న జురాసిక్ వరల్డ్ రీబర్త్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

