Ram Gopal Varma: ‘నేను పైరసీలోనే సినిమాలు చూస్తా..’ టాలీవుడ్‌లో రచ్చ లేపుతున్న RGV స్టేట్‌మెంట్
ఆర్జీవీ తన లాజికల్ మాటలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఐ-బొమ్మ, పైరసీపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఆసక్తి లేకపోతే పైరసీలో చూస్తానని, కలెక్షన్ల గురించి ఆలోచించనని వర్మ అన్నారు. ప్రేక్షకుల మానసికత, సాంకేతికత కారణంగా పైరసీని ఆపడం అసాధ్యమని ఆయన నమ్మకం. ఈ వ్యాఖ్యలు ఐ-బొమ్మ రవి ఇష్యూ నేపథ్యంలో మరింత ఆసక్తి రేపుతున్నాయి.
తన లాజికల్ మాటలతో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యే ఆర్జీవీ.. ఐ-బొమ్మ గురించి… పైరసీలో సినిమాలు చూడడం గురించి ఓ రీసెంట్ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. “నాకు ఆసక్తి ఉన్న సినిమానే థియేటర్‌లో చూస్తా. ఆసక్తి లేకపోతే నేరుగా పైరసీలో చూస్తా. మేకర్స్ కలెక్షన్‌ల గురించి నేనెందుకు ఆలోచించాలి?” అంటూ ఆ ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఏది తక్కువలో దొరుకుతుందో ఆడియన్స్ అదే చూస్తారని.. ఆడియన్స్ మెంటాలిటీ అలాంటిదని.. టెక్నాలజీ ఉన్నంత కాలం పైరసీని ఆపడం అసంభవం. పైరసీ విషయంలో ఆడియన్స్‌ను ఏమాత్రం తప్పుబట్టలేం అంటూ అదే ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు అంతటా రీసౌండ్ చేస్తున్నాయి. అయితే ఐబొమ్మ రవి ఇష్యూ హాట్ టాపిక్ అవుతున్న వేళ… వర్మ మాటలు ఎక్కడికి దారితీస్తాయో చూడాలని అంటున్నారు కొంత మంది నెటిజన్లు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
