Rakul Preet: ప్లాస్టిక్ సర్జరీ బాడీ అంటూ ట్రోల్స్.. సీరియస్ అయిన రకుల్
ఫిట్‌నెస్ ఫ్రీక్ రకుల్ ప్రీత్ సింగ్ జీరో సైజ్‌పై ట్రోలింగ్ ఎదుర్కొంది. కొందరు ప్లాస్టిక్ సర్జరీ అని ఆరోపించగా, రకుల్ తీవ్రంగా స్పందించింది. హెవీ వర్కవుట్స్ వల్లే ఈ ఫిజిక్ వచ్చిందని, బరువు తగ్గడానికి వ్యాయామం ఉత్తమ మార్గమని నెటిజన్లకు గట్టి సమాధానమిచ్చింది. నిజానిజాలు తెలుసుకోకుండా కామెంట్ చేయొద్దని రకుల్ సూచించింది.
ఫిట్ నెస్ కోసం.. ఫిగర్ కోసం సెలబ్రిటీలు జిమ్ చేయడం కామన్! క్రమం తప్పకుండా కసరత్తులు చేయడం కూడా కామనే. ఎర్లీ మార్నింగ్ టైంలో… ట్రెండీ అండ్ ఫ్యాషనబుల్ జిమ్ క్లోత్స్‌లో.. ఫేమస్ జిమ్ సెంటర్ల ముందు కనిపించడం కూడా కామనే! కానీ ఇప్పుడు ఇదే కామన్ థింగ్.. రకుల్‌కు తలనొప్పిగా మారింది. తన ఫ్యాన్సే తనను అర్థం చేసుకోకుండా కామెంట్ చేస్తుండడంతో.. ఆమెకు పట్టరానంత కోపం వస్తోంది. ఇక అసలు విషయం ఏంటంటే..! ఫిట్ నెస్ ఫ్రీక్ అయిన రకుల్ ప్రీత్ సింగ్.. తను చేసే హెవీ వర్కవుట్స్ వల్ల.. జీరో సైజ్‌కు వెళ్లింది. అదే సైజ్‌ను మెయిన్‌టేన్ చేస్తూ వస్తోంది. అయితే ఉన్నట్టుండి కొంత మంది రకుల్ లుక్‌ను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆమె ఇలా మారడానికి కారణం ప్లాస్టిక్ సర్జరీ అంటూ విమర్శించారు. దీంతో లైన్లోకి వచ్చిన రకుల్.. తనను విమర్శిస్తున్న నెటిజన్లను ఏకి పారేసింది. ‘నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు జనాలను తప్పు దారి పట్టిస్తూ ఉంటారు. ఇది నిజంగా భయంకరమైన పని’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. తాను సంప్రదాయ వైద్యంతో బాటు ఆధునిక చికిత్సలనూ నమ్ముతానని చెప్పుకొచ్చింది. ఎవరైనా సర్జరీలు చేయించుకున్నా దానిని తాను తప్పు పట్టనని, వ్యాయామం చేసి కూడా బరువు తగ్గొచ్చు కదా.. అని నెటిజన్స్ మీద సీరియస్ అయింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rashmika Mandanna: దోస్తులకు బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన రష్మిక.. ఫోటోలు వైరల్
Allu Arjun: బన్నీ కోసం 1758 కిలోమీటర్ల సైకిల్ యాత్ర! తెలిసి అక్కున చేర్చున్న ఐకాన్ స్టార్
Dhurandhar: దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి! ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఆకస్మిక మృతి!
