ధనుష్ దర్శకత్వంలో రజినీ సినిమా ??

Edited By: Phani CH

Updated on: Nov 18, 2025 | 1:35 PM

రజినీకాంత్ 50 ఏళ్ళ కెరీర్‌లో ఆయన ప్రొఫెషనలిజం, నిర్ణయాలు అద్భుతం. కూలీలో సత్యరాజ్‌తో నటించడం, కమల్, ధనుష్‌తో భవిష్యత్ ప్రాజెక్టులు ఆయన వృత్తి నైపుణ్యాన్ని చాటుతున్నాయి. వ్యక్తిగత సంబంధాలకు అతీతంగా సినిమాకు ప్రాధాన్యతనిచ్చే రజినీకాంత్, జైలర్ 2 తర్వాత కూడా సరికొత్త ప్రాజెక్టులతో అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రతి కదలిక ఒక సెన్సేషన్.

పక్కా ప్రొఫెషనల్ ఇక్కడ అంటున్నారు రజినీకాంత్. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, ఆలోచిస్తున్న విధానం చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. 50 ఏళ్ళ కెరీర్ కదా.. ఆ మాత్రం ప్రొఫెషనల్ లేకపోతే ఎలా అనుకుంటున్నారు కదా..? అసలు రజినీ తీసుకున్న ఆ డిసిషన్ ఏంటి..? ఎందుకు ఆయన్ని అభిమానులు అంతగా పొగిడేస్తున్నారో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? రజినీకాంత్.. ది సూపర్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమా.. 50 ఏళ్ళ కెరీర్.. ఎన్నో వందల సినిమాలు.. ఇంత అనుభవం ఉన్న నటుడు ప్రొఫెషనల్‌గా కాకుండా ఇంకెలా ఆలోచిస్తారు చెప్పండి..? అందుకేగా మొన్న కూలీలో కూడా 30 ఏళ్ళ తర్వాత ఇగోలు పక్కనబెట్టి సత్యరాజ్‌తో కలిసి నటించారు రజినీ..! సినిమాల్లో పర్సనల్ లైఫ్‌ను తీసుకురారు సూపర్ స్టార్. రజినీ ప్రస్తుతం జైలర్ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. 2026 సమ్మర్ కానుకగా విడుదల కానుంది జైలర్ 2. దీని తర్వాత రజినీ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. కమల్‌తో ఓ మల్టీస్టారర్ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన తలైవా.. కమల్ నిర్మాణంలో సోలో హీరోగానూ ఓ సినిమా చేయడానికి ఓకే అన్నారు. రజినీకాంత్, కమల్ హాసన్ మల్టీస్టారర్‌కు డైరెక్టర్ ఎవరనేది ఇంకా సస్పెన్సే. లోకేష్ కనకరాజ్ పేరు వినిపించినా.. కూలీ తర్వాత మనోడి పేరు మాయమైంది. ఆ తర్వాత మరే దర్శకుడి పేరు ఖరారు కాలేదు. ఈలోపు రేసులోకి అనుకోకుండా ధనుష్ వచ్చారు.. ఈయన హీరోగానే కాదు దర్శకుడిగానూ మంచి పేరు తెచ్చుకున్నారు. రాయన్ లాంటి సినిమాలు ధనుష్‌లోని కమర్షియల్ డైరెక్టర్‌ను చూపించాయి. రజినీకాంత్, ధనుష్ మధ్య ఉన్న రిలేషన్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. మామూలుగా కూతురుతో విడిపోయాక.. ధనుష్, రజినీ మధ్య దూరం పెరిగిందనుకున్నారంతా. కానీ అలాంటిదేం లేదు.. ప్రొఫెషనల్‌గా ఇద్దరి మధ్య ఆ బంధం అలాగే ఉంది. అన్నీ కుదిర్తే ఈ కాంబోలో త్వరలోనే సినిమా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అదే జరిగితే సౌత్‌లో సెన్సేషనల్ సినిమా అవుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్త సినిమాలకంటే.. రీ రిలీజ్ సినిమాలపై ఆడియన్స్ ఆసక్తి

మాకు పక్కా హిట్ కావాల్సిందే.. తాడో పేడో తేల్చుకుంటున్న హీరోలు..

టాలీవుడ్ లో తప్పని హీరోయిన్ల కొరత.. కారణం అదేనా ??

Varanasi: రెండు భాగాలుగా రానున్న వారణాసి.. నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్

Akhanda 2: ప్యాన్ ఇండియన్ మార్కెట్ పై బాలయ్య ఫోకస్

Published on: Nov 18, 2025 01:35 PM