Rajinikanth: వయసు పెరిగే కొద్దీ జోరు పెరుగుతోంది.. రజినీకాంత్ చేతిలో ఇన్ని క్రేజీ సినిమాలా!

Edited By:

Updated on: Aug 16, 2026 | 8:22 PM

వయసు పెరుగుతున్నా రజినీకాంత్‌ సినిమా జోరు మాత్రం తగ్గడం లేదు. జైలర్‌ 2 షూటింగ్‌ పూర్తి చేసిన సూపర్‌స్టార్‌ ప్రస్తుతం ధర్మన్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆయన పవర్‌ఫుల్‌ డాక్టర్‌ పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు కమల్‌ హాసన్‌తో కలిసి భారీ మల్టీస్టారర్‌ కూడా లైన్‌లో ఉంది. వరుస ప్రాజెక్టులతో తలైవా అభిమానులకు ఫుల్‌ కిక్‌ ఇస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా అదే స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు.

వయసుతో ఏమాత్రం సంబంధం లేకుండా వరస సినిమాలతో తనదైన స్టైల్లో రప్ఫాడిస్తున్నారు రజినీకాంత్. చేతినిండా క్రేజీ ప్రాజెక్టులతో కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని స్పీడ్‌తో దూసుకుపోతూ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తున్నారీయన. ఇంతకీ ఈ వయసులోనూ ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా.. తలైవా అంతగా ఎందుకు కష్టపడుతున్నారు..? ఈయన చేస్తున్న సినిమాలేంటి..? రజినీ జోరు మామూలుగా లేదిప్పుడు. నెల్సన్‌తో జైలర్ 2 షూటింగ్ పూర్తి చేసిన సూపర్ స్టార్.. మరో రెండు సినిమాలు లైన్‌లో పెట్టారు. అక్టోబర్ 15న జైలర్ 2 విడుదల కానుంది. ముత్తువేల్ పాండియన్‌గా సూపర్ స్టార్ మరోసారి స్క్రీన్ మీద తనదైన స్టైల్ అండ్ స్వాగ్‌తో రచ్చ చేయడానికి వచ్చేస్తున్నారు. దాంతో పాటే ధర్మన్ సినిమా షూట్ కూడా జోరు మీదుంది. కమల్ హాసన్ నిర్మాణంలో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రజినీకాంత్ చేస్తున్న ధర్మన్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ మొదలుపెట్టగా.. ఇందులో సూపర్ స్టార్ ఓ పవర్ ఫుల్ డాక్టర్ పాత్రలో కనిపిస్తున్నారు. అన్నీ కుదిరితే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటే కమల్ హాసన్, రజినీకాంత్ కలిసి నటించబోయే భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కూడా లైన్‌లోనే ఉంది. జైలర్ 2 సినిమా పనులు పూర్తయ్యాక నెల్సన్ ఈ మల్టీస్టారర్ స్క్రిప్ట్ మీద వర్క్ చేయనున్నారు. ఒకే ఫ్రేమ్‌లో సూపర్ స్టార్స్‌ను చూడ్డానికి వేయి కళ్లతో వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. మొత్తానికి ఏజ్ పెరుగుతున్న కొద్దీ.. రజినీలో జోరు పెరుగుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తుపాకులు వదిలి ర్యాంప్‌పైకి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు..

ఆధార్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు

ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వారి వల్ల కాలేదు.. చివరికి ఇలా..!

ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు!

మీ ఇంట సిరులు కురిపించే మొక్క! ఈ రోజులు, దిశలో నాటాలి గుర్తుంచుకోండి

Loading...
Unable to load recommendations.
Follow Us