Vettaiyan OTT: అప్పుడే ఓటీటీలోకి రజనీకాంత్ వేట్టయన్..
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం వేట్టయన్. జై భీమ్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టీజే జ్ఞానవేల్ ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించారు. దసరా కానుకగా ఈనెల 10న విడుదలైన వేట్టయన్ సూపర్ హిట్ గా నిలిచింది. తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లు దక్కించుకుంది. సినిమా రిలీజైన రోజు నుంచి ఇప్పటి వరకు రూ.134 కోట్ల కలెక్షన్లు రాబట్టింని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
అంచనాలకు మించి భారీ వసూళ్లు రావడంతో తాజాగా సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా గట్టిగా నిర్వహించింది వేట్టయన్ బృందం. ఇక ఈ క్రమంలోనే వేట్టయన్ మూవీ ఓటీటీ విడుదలపై సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా అతి త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. వేట్టయన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇందుకోసం వేట్టయన్ మేకర్స్ కూ భారీగానే ముట్టజెప్పినట్లు టాక్. ఇక థియేట్రికల్ రిలీజ్ తర్వాత నాలుగు వారాల కు సినిమా ఓటీటీకి వచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఈ లెక్కన నవంబర్ 7 న లేదా 9న వేట్టయన్ ఓటీటీలోకి రానుందట. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Karthi Satyam Sundaram OTT: ఇట్స్ అఫీషియల్.. అప్పుడే OTTలోకి సత్యం సుందరం మూవీ
క్రేజీ న్యూస్.. NTR సినిమాలో షారుఖ్ ఖాన్
Chandrababu Naidu Season 4: తన అరెస్ట్ గురించి చెబుతూ చంద్రబాబు ఎమోషనల్