సినిమా నుంచి యూటర్న్ !! లోగుట్టు ఏమై ఉంటుంది ??
రజినీకాంత్, కమల్‌హాసన్ కలయికలో రాబోయే 'తలైవర్ 173' చిత్రం నుండి దర్శకుడు సుందర్ సి తప్పుకున్నారు. అనూహ్య కారణాల వల్ల ఈ గొప్ప ప్రాజెక్ట్ నుండి వైదొలుగుతున్నానని ఆయన భావోద్వేగంగా ప్రకటించారు. తొలుత ఈ మెగా కాంబో భారీ అంచనాలను సృష్టించగా, సుందర్ సి నిష్క్రమణ చిత్ర వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కమల్, రజినీలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ప్రకటన చేశారు.
కోలీవుడ్‌లోనే కాదు.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది బిగ్ స్టార్స్ కమల్ అండ్ రజినీ. అలాంటి వీరిద్దరు కొన్ని ఏళ్ల తర్వాత కలిసి సినిమా చేస్తున్నారనే న్యూస్ బయటికి రాగానే సెన్సేషనల్ అయింది. కమల్, రజినీ వైపే అందరూ చూసేలా.. ఆ కాంబో గురించి ఆరా తీసేలా చేసింది. కట్ చేస్తే.. వారిద్దరి నుంచే నేరుగా అఫీషియల్ న్యూస్ బయటికి వచ్చింది. కమల్ ప్రొడ్యూసర్‌గా రజినీగా హీరోగా.. సుందర్ సీ డైరెక్షన్లో సినిమా తెరకెక్కనుందనే అనౌన్స్‌మెంట్ బయటికి వచ్చింది. దానికి తోడు ఈ ముగ్గరు కలిసి దిగిన ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. ఇక ప్రీ ప్రొడక్షన్ తరువాయే అన్న టైంలో ఈ మూవీ నుంచి డైరెక్టర్ సుందర్ సీ యూటర్న్ తీసుకోవడం సంచలనంగా మారింది. వెనకాల ఏదో జరుగుతుందనే కామెంట్ వచ్చింది. రజనీకాంత్ తన 173వ మూవీ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు డైరెక్టర్ సుందర్ తన సోషల్ మీడియా వేదిక గా ప్రకటించాడు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశాడు. కాస్త ఎమోషనల్‌గా తలైవర్ 173 మూవీ నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పాడు. దాంతో పాటే తనను తలైవర్ 173 సినిమాకు డైరెక్టర్‌గా కన్సిడర్ చేసిన కమల్‌కు, రజినీ కి స్పెషల్ థాంక్స్ చెప్పాడు. తన ప్రకటనలో డైరెక్టర్ సుందర్ సీ. ఏం రాసుకొచ్చారంటే…! భారమైన హృదయంతో ఈ ముఖ్య విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నా. అనూహ్యమైన, అనివార్య కారణాల వల్ల ‘తలైవర్ 173’ అనే గొప్ప ప్రాజెక్ట్ నుంచి నేను తప్పుకుంటున్నాను. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తూ.. కమల్‌హాసన్ నిర్మిస్తున్న ఈ మహా కృతికి నన్ను పరిగణలోకి తీసుకున్నందుకు వాళ్లిద్దరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా.. సరే రజనీకాంత్, కమల్ హాసన్‌లతో అనుబంధం అలానే కొనసాగుతుంది. గతకొన్నిరోజులుగా వాళ్లతో గడిపిన క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చాడు డైరెక్టర్ సుందర్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
థియేటర్ లో చున్నీ వివాదంపై నోరు విప్పిన డైరెక్టర్
రెండో సినిమాకు చరణ్.. మూడో సినిమాకు షారుఖ్
Akhanda 2: బాలయ్య సినిమాకూ అవే కష్టాలు ?? కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్
Prabhas: డ్యాన్స్ మాస్టర్‌కు .. గొప్ప ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్
White Hair: తెల్ల జుట్టు మంచిదే.. క్యాన్సర్ ను అడ్డుకుంటుందట
