SS Rajamouli: అటు పోలీస్ కేసు.. ఇటు టైటిల్ వివాదం! దెబ్బ మీద దెబ్బ!
రాజమౌళి రెండు పెద్ద వివాదాల్లో చిక్కుకున్నారు. దేవుళ్లపై ఆయన చేసిన వ్యాఖ్యలు హిందూ మనోభావాలను దెబ్బతీశాయంటూ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరోవైపు, మహేష్ బాబు సినిమాకు 'వారణాసి' టైటిల్ విషయంలో రిజిస్టర్ వివాదం చెలరేగింది. టైటిల్ హక్కులపై ఫిర్యాదులు రావడంతో ఈ అంశం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాజమౌళి చిక్కుల్లో పడ్డాడు.ఆయపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తాను దేవుళ్లను నమ్మనంటూ రీసెంట్‌గా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్‌లో జక్కన్న కామెంట్ చేశారు. అయితే ఈ కామెంట్ పైనే రాష్ట్రీమ వానరసేన సంఘం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. జక్కన్న చేసిన కామెంట్.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఉందంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సరూర్ నగర్ పోలీసులు రాజమౌళి పై కేసు నమోదు చేశారు. గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్లో దేవుడంటే నమ్మకం లేదన్న జక్కన్న కామెంట్‌ను అటుంచితే ఇప్పుడు ఈ మూవీ చుట్టూ టైటిల్ వివాదం రాజుకుంది. ‘వారణాసి’ టైటిల్‌ని తాము ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నామంటూ రామ భక్త హనుమ క్రియేషన్స్ బ్యానర్, ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేసింది. మహేష్ మూవీ ఎనౌన్స్‌మెంట్ కన్నా ముందే తమ బ్యానర్లో వారణాసి టైటిల్ తో సినిమా అనౌన్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేసినట్టు చిరపురెడ్డి సుబ్బారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. టైటిల్ హక్కులు తమవే అంటూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌లో టైటిల్ రిజిస్టర్ సందర్భంగా ఇచ్చిన కాపీని కూడా ఆయన మీడియాకు రిలీజ్ చేశాడు. అయితే వారణాసి విషయంలో టైటిల్ మార్పు ఉండకపోవచ్చన్న టాకే వినిపిస్తోంది. ఆల్రెడీ టైటిల్‌లో ‘SS రాజమౌళీస్ వారాణాసి’ అనే ఉంది. అదే టైటిల్‌ను రిజిస్టర్ చేసి ఆ టైటిల్ మీదే సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
