మద్యం సీన్స్ ఉన్నాయని “మహానటి”కి నో చెప్పిన ఆ బ్యూటీ ఎవరు ??

|

Aug 18, 2022 | 3:02 PM

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమా ఏ రెంజ్‏లో హిట్ అయ్యిందో తెలిసిందే. దివంగత నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో హీరోయిన్ కీర్తి సురేష్ నటించింది.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమా ఏ రెంజ్‏లో హిట్ అయ్యిందో తెలిసిందే. దివంగత నటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో హీరోయిన్ కీర్తి సురేష్ నటించింది. సావిత్రి పాత్రలో కీర్తి ఒదిగిపోయింది. ఆమె నటకు జాతీయ ఉత్తమ నటి అవార్డు సైతం వరించింది. మహానటి సావిత్రిని మైమరపించి.. నటనతో సినీ విమర్శకులను మెప్పించింది. ఈ మూవీ కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. కీర్తి కెరీర్‏లో ది బెస్ట్ మూవీగా నిలిచింది ఈ సినిమా. అయితే ఈ సినిమా కోసం ముందుగా కీర్తి సురేష్‏ను అనుకోలేదట. మలయాళీ నటిని తీసుకోవాలని ఆమెను సంప్రదించగా.. మద్యం సీన్స్ ఉంటే తాను చేయనని చెప్పడంతో.. ఈ ఆఫర్ కీర్తిని వరించిందట. ఈ విషయాన్ని చిత్రనిర్మాత అశ్విని దత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. కేవలం మద్యం సీన్స్ కోసం బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని వదులుకుంది ఆ బ్యూటీ.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వ్యక్తి కంట్లోకి దూసుకెళ్లిన కత్తిని.. వైద్యులు ఎలా తీశారో చూడండి

ఎందుకూ పనికిరాదని మూలన పడేశారు.. కట్‌చేస్తే.. వేలంలో దాని విలువ తెలిసి షాక్ !!

Published on: Aug 18, 2022 03:02 PM