‘పని మనిషి చేతిలో మోసపోయా..’ ప్రసాద్ ఎమోషనల్‌

Updated on: Oct 23, 2025 | 2:01 PM

ప్రసాద్ బెహ్రా..! యూట్యూబ్‌ షార్ట్ ఫిల్మ్స్‌తో.. షార్ట్ సిరీసులతో మంచి కామెడీ టైమింగ్‌ ఉన్నయాక్టర్‌గా గురింపు తెచ్చుకున్న ఈయన.. ఈ మధ్య సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. సినిమాల్లోనూ స్టార్ కమెడియన్‌గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. తన రీసెంట్‌ ఫిల్మ్ మిత్ర మండలి సినిమాలో మంచి రోల్ చేసి.. తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశాడు.

ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూకు వచ్చిన ఈ కమెడియన్.. తాను పని మనిషి చేతిలో మోసపోనంటూ.. దానివల్ల మనుషుల మీద పూర్తిగా నమ్మకం పోయిదంటూ చెప్పి ఎమోషనల్ అయ్యాడు. తన మాటలతో ఇప్పుడు నెట్టిట వైరల్ అవుతున్నాడు. యూట్యూబ్‌ స్టార్ ప్రసాద్ బెహరా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవిత అనుభవాలను, ఆర్థిక దృక్పథంపై కీలక విషయాలు వెల్లడించాడు ప్రసాద్‌ బెహ్రా. ఒకప్పుడు తాను మనుషులను త్వరగా నమ్మేవాడినని.. అయితే కొన్ని సంఘటనల వల్ల ఆ నమ్మకం సన్నగిల్లిందని చెప్పుకొచ్చాడు. తన ఇంట్లో పనిచేసిన ఒక మహిళకు అధిక జీతం ఇచ్చి.. వారానికో కిలో మటన్, కుటుంబంతో సినిమా టిక్కెట్లు, నెలవారీ సరుకులు వంటి అనేక సౌకర్యాలు కల్పించినప్పటికీ, ఆమె తన విలువైన వాచీలను దొంగిలించి కేవలం 400 రూపాయలకు అమ్మేసిందని తెలిపాడు. ఈ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, మనుషులపై నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయేలా చేసిందని ప్రసాద్ బెహరా పేర్కొన్నాడు. ఇప్పుడు తాను ఎవరినీ నమ్మడం లేదని చెప్పాడు. డబ్బు సంపాదనపై, ఖర్చులపై తన దృక్పథం మారిందని, పొదుపుపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని, నచ్చినవి కొనుక్కోవడానికి వెనుకాడనని అన్నాడు. తన జీవిత ప్రయాణం ఇతరులకంటే భిన్నంగా ఉందని, అన్ని సమస్యలను నవ్వుతూ ఎదుర్కొంటున్నానని ప్రసాద్ బెహరా వివరించాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హాట్ సీన్లతో బ్యాన్ అయిన మూవీ.. OTTలో మాత్రం సూపర్ హిట్

అమ్మాయిలతో న్యూడ్ వీడియోకాల్…! తాను అలాంటి వాడిని కాదంటూ నటుడు ఎమోషనల్

Bigg Boss Telugu 9: ఆ ఇద్దరి పులిహోర పంచాయితీలో..ఎరక్కపోయి ఇరుక్కున్న రమ్య

Samantha: దీపావళి వేడుకల్లోనూ ఆ వ్యక్తి పక్కనే.. హాట్ టాపిక్ గా సమంత తీరు

Renu Desai: సన్యాసిగా మారాలని ఉంది.. రేణూ షాకింగ్ కామెంట్స్