Prakash Raj on KCR: కేసీఆర్ ఓటమి చాలా బాధ కలిగించింది.! ప్రకాష్ రాజ్ ఎమోషనల్..

|

Dec 05, 2023 | 12:36 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించింది. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మరోవైపు ముచ్చటగా మూడో సారి అధికారం చేపడుతామనకున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఓటమితో నిరాశలో కూరుకుపోయాయి. బీఆర్‌ఎస్‌ ఓటమితో ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్‌ కు తన రాజీనామా లేఖను పంపించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్‌ పార్టీ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించింది. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మరోవైపు ముచ్చటగా మూడో సారి అధికారం చేపడుతామనకున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఓటమితో నిరాశలో కూరుకుపోయాయి. బీఆర్‌ఎస్‌ ఓటమితో ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్‌ రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్‌ కు తన రాజీనామా లేఖను పంపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వానికి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. అదే సమయంలో సుమారు పదేళ్ల పాటు తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన కేసీఆర్‌తో పాటు ఇతర బీఆర్‌ఎస్‌ నాయకులకు తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఇప్పటికే డైరెక్టర్‌ ఆర్జీవీ, స్టార్‌ యాంకర్‌ అనసూయ, సందీప్‌ కిషన్‌, నిఖిల్ కేటీఆర్‌కు సపోర్టుగా సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. తాజాగా సీనియర్‌ నటుడు ప్రకాష్‌ రాజ్‌ బీఆర్‌ఎస్‌ ఓటమిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ ప్రకాష్ రాజ్ తన ట్వీట్ లో ఎం రాసుకొచ్చారు అంటే.. ‘ ఇది చాలా బాధ కలిగించింది. అయినా ప్రజా తీర్పును గౌరవించాల్సిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు కంగ్రాట్స్. కేసీఆర్‌, కేటీఆర్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు. ఏది ఏమైనా మేమంతా మీ వెంటే ఉంటాం. మీ గుండె ఎప్పుడూ తెలంగాణ కోసమే కొట్టుకుంటుందని మాకు తెలుసు’ అని ట్వీట్‌ చేశారు ప్రకాష్‌ రాజ్‌. ఇక ఎప్పటిలాగే ‘ట్రోలర్స్‌కు ఆహ్వానం’ అంటూ ఫైనల్‌ పంచ్‌ ఇచ్చారీ సీనియర్‌ నటుడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.