Prabhas: ప్రభాస్ ప్లాన్‌కు మైండ్ బ్లాక్.. ఇలాగైతే రికార్డులు కష్టమే
ప్రభాస్ తన పాత వ్యూహాన్ని మళ్ళీ ప్రారంభిస్తూ 2026 నుండి ఏటా రెండు సినిమాలు విడుదల చేయాలని ప్రణాళిక వేస్తున్నారు. 'రాజా సాబ్' నిరాశపరిచిన నేపథ్యంలో, ఇకపై ఎలాంటి గ్యాప్ లేకుండా సినిమా చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం 'స్పిరిట్', 'కల్కి 2' చిత్రీకరణలో ఉండగా, 'ఫౌజీ' ఆగస్టు 15, 'స్పిరిట్' 2027 మార్చి, 'కల్కి 2' 2027 దసరాకు విడుదల కానున్నాయి.
ఒక్క ఏడాది గ్యాప్ వచ్చేసరికి మళ్లీ పాత ప్లాన్ అప్లై చేయడానికి ప్రభాస్ రెడీ అయిపోయారా..? 2022 నుంచి ఏడాదికి కనీసం ఒకటి.. కుదిర్తే 2 సినిమాలు అనే కాన్సెప్ట్‌తోనే వస్తున్నారు రెబల్ స్టార్. కానీ 2025లో ఆ ప్లాన్ వర్కవుట్ కాలేదు. అందుకే రెండేళ్ళ కింద ఏం చేసారో.. రాబోయే రెండేళ్లు అదే చేయాలని చూస్తున్నారు ప్రభాస్. మరి ఆ ప్లాన్ ఏంటి..? రాజాసాబ్‌తో ప్రభాస్ అభిమానులు ఒకింత నిరాశ పడ్డారు. పండక్కి వచ్చిన సినిమాలన్నీ కలెక్షన్లు కొల్లగొడుతుంటే.. రెబల్ స్టార్ మాత్రం ఓపెనింగ్స్‌తోనే సరిపెట్టుకున్నారు. పైగా రాజా సాబ్‌ను మూడేళ్ళు తీసారు మారుతి. కానీ ఫలితం కోరుకున్నట్లుగా రాలేదు. అందుకే ఇకపై అస్సలు గ్యాప్ ఇవ్వొద్దని ఫిక్సైపోయారు ప్రభాస్. ఏడాదికి కనీసం 2 సినిమాలతో రానున్నారు. ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్ సెట్‌లో ఉన్నారు.. ఫిబ్రవరి నుంచి కల్కి 2 మొదలు కానుంది. ఈ 2 సినిమాలు ఒకేసారి పూర్తి చేయాలనేది ప్రభాస్ ప్లాన్. షెడ్యూల్స్ కూడా అలాగే వేస్తున్నారు. ఇక మార్చి నుంచి ఫౌజీ కొత్త షెడ్యూల్ షురూ కానుంది. మిగిలిన 60 రోజుల బ్యాలెన్స్ పూర్తి చేసి.. ఆగస్ట్ 15న ఫౌజీని విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. స్పిరిట్ షూటింగ్ అక్టోబర్ నాటికి పూర్తి చేయాలనేది సందీప్ వంగా ప్లాన్. పోస్ట్ ప్రొడక్షన్ ప్లస్ ప్రమోషన్స్ అన్నీ పక్కాగా చేసుకుని మార్చి 5, 2027న సినిమాను విడుదల చేయనున్నారు మేకర్స్. అలాగే కల్కి 2 సినిమాను 2027 దసరాకు విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. మొత్తానికి 2026లో రెండు.. 2027లో 2 సినిమాలతో రావాలని చూస్తున్నారు రెబల్ స్టార్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varun Tej: వరుణ్ తేజ్ పరిస్థితి ఏంటి.. కనకరాజు కరుణిస్తాడా..?
Keerthy Suresh: మరోసారి బాలీవుడ్ వైపు చూస్తున్న కీర్తి సురేష్.. అంతలా ఏముంది అక్కడ
Don 3: డాన్ -3 విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చిన మేకర్స్
Karthi: అభిమానులకు షాక్ ఇచ్చిన కార్తి.. ఖైదీ 2 ఉన్నట్లా.. లేనట్లా