థాంక్యూ ప్రభాస్! భోజనంతో కడుపు మాత్రమే కాదు.. నా హృదయం కూడా నింపేసావు’
ఇమాన్వీ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌గా పేరు తెచ్చుకొని, ప్రభాస్ 'ఫౌజీ' సినిమాలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్ ఆతిథ్యం, ముఖ్యంగా ఇంటి భోజనం గురించి ప్రశంసిస్తూ పోస్ట్ చేసింది. ప్రభాస్ తమకు రుచికరమైన ఇంటి భోజనం పంపించారని, కడుపుతో పాటు గుండె కూడా నిండిపోయిందని పేర్కొంది. ఈ పోస్ట్, ప్రభాస్ గత ఆతిథ్య పరంపరను గుర్తు చేస్తూ, వైరల్‌గా మారింది.
సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయన్సర్‌గా పాపులారిటీ సంపాదించేకుని…. నేరుగా ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఇమాన్వీ. హనుకు నచ్చేయడంతో.. ఫౌజీ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ రోల్ దక్కించుకుంది. అయితే ఈ బ్యూటీ ఇప్పుడు ఉన్నట్టుండి ఓ పోస్ట్‌తో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రేమతో పుట్టే భోజనం గురించి ఇమాన్వీ ఇంట్రెస్టింగా రాసుకురావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ తమ కోసం ఇంటి నుంచి రుచికరమైన భోజనం తెప్పించారని తాజాగా ఇమాన్వీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. మీ ఇంటి భోజనం తిని కడుపుతో పాటు గుండె కూడా ప్రేమతో నిండిపోయిందని తన పోస్టులో రాసుకొచ్చింది. థ్యాంక్ యూ ప్రభాస్ గారు అంటూ తన ఆనందాన్ని తన సోషల్ మీడియా ఫాలోవర్స్‌తో పంచుకుంది. అంతేకాకుండా ప్రభాస్ చేయించిన వెరైటీ వంటకాలను ఒక వీడియో రూపంలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇప్పుడే కాదు గతంలోనూ తనతో పని చేసిన తోటి సెలబ్రిటీలకు ప్రభాస్ పసందైన విందు భోజనం ఏర్పాటు చేశాడు. తన ఇంటి నుంచి తయారు చేయించి తెప్పించే వాడు. ఇలా చాలా సందర్భాల్లో తన ఆతిథ్యం రుచి చూపించి.. అందర్నీ ఫిదా చేశాడు మన డార్లింగ్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘మా నాన్న చనిపోలేదు..’ తప్పుడు వార్తలపై ధర్మేంద్ర కూతురు సీరియస్
‘మెడలో నక్లెస్ కాదు.. పెళ్లికి వడ్డానం కూడా పెట్టుకుంటా’ ట్రోలర్స్‌కు శిరీష్ దిమ్మతిరిగే పంచ్
తాను ఊహించినట్టే.. ఈ హీరో మరణించాడు..! డెస్టినీ అంటే ఇదేనేమో
