Prabhas: ఇండియాలో నెంబర్ 1 స్టార్ మనోడే !!
ఓర్మాక్స్ మీడియా డిసెంబర్ మోస్ట్ పాపులర్ మేల్ ఫిల్మ్ స్టార్స్ జాబితాలో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు. తెలుగు హీరోలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. దళపతి విజయ్, షారూఖ్ ఖాన్ స్థిరంగా ఉండగా, పవన్ కళ్యాణ్ టాప్ 10లో లేకపోవడం చర్చనీయాంశమైంది. ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ నెంబర్ 1 ర్యాంకింగ్‌కు కారణం.
ఓర్మాక్స్ మీడియా తాజాగా డిసెంబర్ నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ మేల్ ఫిల్మ్ స్టార్స్ జాబితా బయటకు వచ్చింది. ఇందులో తెలుగు హీరోలు తమ ఆధిపత్యాన్ని చాటుకోగా, ఒకప్పటి అగ్ర హీరోలు కొందరు కింది స్థానాలకు పడిపోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఇండియాలోనే మోస్ట్ పాపులర్ మేల్ ఫిల్మ్ స్టార్‌గా రెబల్ స్టార్ ప్రభాస్ తన నెంబర్ వన్ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. గత కొంత కాలంగా ఆయన్ని టచ్ చేసే వారే లేరని చెప్పవచ్చు. వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తుండటం, దేశవ్యాప్తంగా ఆయన సినిమాలపై చర్చ జరగడం ప్రభాస్‌కు ప్లస్ అయ్యింది. ఇటీవల ‘ది రాజా సాబ్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్, బాక్సాఫీస్ ఫలితంతో సంబంధం లేకుండా తన ఇమేజ్‌ను కాపాడుకుంటున్నారు. ఆయన సినిమాల అప్‌డేట్స్ కోసం దేశవ్యాప్త అభిమానులు ఎదురుచూస్తుండటం ప్రభాస్‌ను అగ్రపీఠాన నిలబెట్టింది. ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన జాబితాలో రెండో స్థానంలో కోలీవుడ్ దళపతి విజయ్ నిలిచారు. గత కొన్ని నెలలుగా ఆయన తన స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటున్నారు. ఇక మూడో స్థానంలో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ నిలిచారు. విజయ్, షారూఖ్ ఇద్దరూ తమ స్థానాల్లో స్థిరంగా కొనసాగుతూ నేషనల్ లెవల్లో తమ ప్రభావాన్ని చూపిస్తున్నారు.ఆ తర్వాత నాలుగో స్థానంలో ఐకాన్ స్టార్.. నిలిచారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే ఎప్పుడూ టాప్ లిస్ట్ లో ఉండే పవన్ కళ్యాణ్ ఈసారి టాప్ 10 జాబితాలో కనిపించలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rashmika Mandanna: రష్మిక మాటలతో తప్పు ఎవరిదో తేలిపోయింది
CM రిక్వెస్ట్ తో వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి వెళ్లిన మెగాస్టార్
‘నా ఫోటోలు జూమ్ చేసి చూశారు’ హీరోయిన్ ఎమోషనల్
