ప్రభాస్‌ సినిమాకు OTT దెబ్బ..! రిలీజ్‌ కష్టమేనా?

Updated on: Jul 18, 2025 | 7:00 PM

ఓ పక్క ప్రభాస్‌ తన తప్పేం లేకుండా తను ఒప్పుకున్న సినిమాల్లో నటిస్తూ వెళుతున్నారు. కానీ ప్రభాస్‌తో పని చేసే మేకర్స్ మాత్రం తమ సినిమా షెడ్యూల్స్‌ను ప్లాన్ చేయడంలో తడబడుతున్నారు. షూటింగ్‌ అనుకున్న టైంకి ఫినిష్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. దీంతో ప్రభాస్‌ సినిమాలు పోస్ట్ పోన్ బారిన పడాల్సి వస్తోంది. దీంతో రిమైనింగ్ సినిమాలపై ఆ ఎఫెక్ట్‌ పడుతోంది.

ఇప్పుడు రాజాసాబ్‌ పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇలాగే ఉందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. మారుతీ డైరెక్షన్లో హర్రర్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న రాజా సాబ్‌ సినిమా… ఏప్రిల్లోనే రిలీజ్ కావాల్సింది ఉంది. కానీ షూటింగ్ బ్యాలెన్స్ ఉండడం.. వీఎఫ్‌ ఎక్స్‌ వర్క్‌ పెండింగ్‌లో ఉండడంతో.. రిలీజ్‌ డేట్ పోస్ట్ పోన్ అయింది. అది కాస్త డిసెంబర్ 5కు మారింది. ఈ విషయాన్ని పవర్ ఫుల్ అండ్ ఫన్నీ టీజర్‌ వదిలి మరీ క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అయితే ఇప్పుడా డేట్‌కి కూడా రాజా సాబ్‌ థియేటర్లలోకి రాలేని పరిస్థితి నెలకొందని ఇండస్ట్రీలో టాక్. అందుకు ఈ సారి ఓటీటీ సంస్థలు అడ్డంకిగా మారాయట. ఎస్ ! ఎప్పుడూ కోట్లకు కోట్లు కుమ్మరించి మరీ ప్రభాస్‌ సినిమా రైట్స్‌ కొనే ఓటీటీ సంస్థలు.. ఈ సారి ప్రభాస్‌ సినిమాకు స్లాట్‌ ఇచ్చేందుకు ఖాళీ లేదని చెబుతున్నాయట. డిసెంబర్‌లో తమ డీల్స్ అన్నీ ఫినిష్‌ అయ్యాయని.. మళ్లీ వచ్చే ఏడాదికి అయితే రాజా సాబ్‌తో డీల్‌కు రెడీ అని ఓటీటీ సంస్థలు చెబుతున్నాయట. దీంతో ఈ మూవీ మేకర్స్ ఇప్పుడు ఆలోచనలో పడినట్టు ఇన్‌సైడ్ న్యూస్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స్పిరిట్ సినిమాపై అతి తెలివిగా మాట్లాడిన త్రిప్తి

రిలీజ్‌కు ముందే 50 కోట్లు కొల్లగొట్టిన కింగ్‌ ??

స్పెషల్ లేడీతో మహేష్ మాస్ స్టెప్పులు.. కుర్చీని తిరగేసే ప్లాన్ చేస్తున్న జక్కన్న

‘గోదారి గట్టు’ సాంగ్‌ను మించేలా.. చిరుతో నయన్ రొమాంటిక్‌ సాంగ్

Junior: జూనియార్ రివ్యూ.. పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదే!