డ్రీమ్ ప్రాజెక్టు కోసం డార్లింగ్ కావాలంటున్న మేకర్స్

Edited By:

Updated on: Nov 26, 2025 | 6:09 PM

డ్రీమ్ ప్రాజెక్టులకు పర్ఫెక్ట్ హీరోగా ప్రభాస్ నిలుస్తున్నారు. ఆయనపై మేకర్స్‌కు 5000 కోట్ల బాక్సాఫీస్ ధీమా ఉంది. సలార్ విజయంతో మరింత ఊపందుకున్న ప్రభాస్, స్పిరిట్, రాజా సాబ్ వంటి రాబోయే ఆరు సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్‌ను శాసించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన అసాధారణ మార్కెట్, గ్లోబల్ అపీల్‌ను బ్యాలన్స్ చేస్తూ, ప్రతీ స్క్రిప్ట్‌ను ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లే నమ్మకం నిర్మాతలలో ఉంది.

డ్రీమ్‌ ప్రాజెక్టులు డిజైన్‌ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్ హీరో ఉండాలి. పర్ఫెక్షన్‌ అంటే ఏంటి? అనే మాటకు రకరకాల పారామీటర్స్ ఉంటాయి. ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్ కంటెంట్‌కి తగిన ఫిజిక్‌ ఉండాలి, మార్కెట్‌ పరంగా ఎంతైనా పెట్టొచ్చనే ధీమా ఉండాలి. అంతకన్నింతలు వసూలు చేసి తీసుకొస్తారనే కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇన్నీ ఉన్న హీరో ఎవరంటే ఫస్ట్ ప్లేస్‌లో కనిపిస్తున్నారు డార్లింగ్‌ ప్రభాస్‌.. ఇప్పుడు ఆయన్ని నమ్మి ఏకంగా ఐదు వేలకు కోట్లకు పైగానే బాక్సాఫీస్‌ లెక్కలున్నాయి… ఆ విశేషాలను ఓ సారి గుర్తుచేసుకుందాం వచ్చేయండి. సలార్‌ సినిమా.. షారుఖ్‌ డంకీతో పోటీ పడ్డా ఎక్కడా నిరాశపరచలేదు. అప్పటిదాకా కాస్త అటూ ఇటూ ఉన్న ప్రభాస్‌ సక్సెస్‌ని గాడిలో పెట్టిన మూవీ. అందుకే ఆ సినిమా అన్నా, నీల్‌ అన్నా… ప్రభాస్‌కి అదో రకమైన ఇష్టం. ఇప్పుడు అదే ఇష్టాన్ని మరోసారి చెప్పేశారు నీల్‌. తన కెరీర్‌ బెస్ట్ స్క్రిప్ట్ శౌర్యాంగపర్వం అని అనేశారు నీల్. ఇప్పుడు సెట్స్ మీదున్న స్పిరిట్‌ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నది అభిమానులు మాత్రమే కాదు, సందీప్‌ రెడ్డి వంగా కూడా. కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్‌ అనే మాటకు స్పిరిట్‌లో పక్కా ఎలివేషన్‌ ఉంటుందనే టాక్‌ ఆల్రెడీ స్ప్రెడ్‌ అవుతోంది. ఇటు రాజాసాబ్‌, ఫౌజీ సినిమాలు మినిమమ్‌ గ్యారంటీ అనే మాటలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ప్రేక్షకులు కోరుకునే అంశాలు పర్ఫెక్ట్ గా సూట్‌ అవ్వాలేగానీ వెయ్యి కోట్లు పక్కాగా కలెక్ట్ చేస్తాయి డార్లింగ్‌ సినిమాలనే టాక్‌ ఉంది. ఓ వైపు మార్కెట్‌, మరోవైపు ఎలివేషన్‌… అన్నిటినీ బ్యాలన్స్ చేసుకుంటూ తమ స్క్రిప్ట్ ని వరల్డ్ వైడ్‌ ఆడియన్స్ దగ్గరకు ఈజ్‌తో తీసుకెళ్తారనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది మేకర్స్ లో. రెండు యానిమేషనల్‌ మూవీస్‌తో కలిపితే అరడజను సినిమాలతో షటిల్‌ ఆడుతున్న టాలీవుడ్‌ హీరోగా ప్రభాస్‌ గురించి మాట్లాడుకుంటున్నారు ప్యాన్‌ ఇండియా ఆడియన్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాలయ్య క్రేజ్‌ ముందు మోకరిల్లిన అవెంజర్స్‌

సినిమా హాళ్లు,అపార్ట్‌మెంట్లలోకి ఆధార్‌ ఉంటేనే ఎంట్రీ?త్వరలో కొత్త రూల్‌

పెళ్లిలో ఖరీదైన గిఫ్ట్‌ ఇస్తున్నారా ?? అయితే ఈ విషయం తప్పకుండ తెలుసుకోవాలి

కూల్‌డ్రింక్‌పై ఇష్టంతో అతనేం చేశాడో చూడండి !!

వీళ్లు మామూలోళ్లు కాదు.. పోలీసులకే మస్కా కొట్టి జంప్‌