దీపిక Vs త్రిప్తీ.. గ్యాప్ ఉన్నట్టా.. లేనట్టా
స్పిరిట్ సినిమా కాస్టింగ్ సెలక్షన్ బాలీవుడ్‌లో పెద్ద రచ్చే అయ్యింది. దీపికను తప్పించి త్రిప్తీని హీరోయిన్ తీసుకోవటం మీద నేషనల్ లెవల్‌లో చర్చ జరిగింది. ఈ మార్పులు దీపిక, త్రిప్తి మధ్య కూడా గ్యాప్ పెంచాయన్న న్యూస్ అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. కానీ ఈ న్యూస్‌కు ఒక్క లైక్‌తో చెక్ పెట్టారు త్రిప్తీ. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ స్పిరిట్.
ఈ సినిమాలో హీరోయిన్‌గా ముందు దీపికను తీసుకోవాలనుకున్నా.. ఆమె డిమాండ్లు భారీగా ఉండటంతో పక్కన పెట్టేశారు. యానిమల్ బ్యూటీ త్రిప్తీ దిమ్రీని డార్లింగ్‌కు జోడీగా ఫైనల్ చేశారు. ఈ కాంబో స్పిరిట్ ప్రాజెక్ట్ మీద ఇన్‌స్టాంట్ హై తీసుకువచ్చింది. సందీప్ నిర్ణయంతో దీపిక, త్రిప్తీ మధ్య కూడా గ్యాప్ వచ్చిందన్న న్యూస్ ఫిలిం నగర్‌లో వైరల్ అయ్యింది. ఆ తరువాత ఇద్దరు బ్యూటీస్ ఎదురు పడకపోవటం, ఒకరి గురించి ఒకరు మాట్లాడే సిచ్యుయేషన్ కూడా రాకపోవటంతో గ్యాప్ నిజమే అనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఈ అనుమానాలకు ఒక్క లైక్‌తో చెక్ పెట్టారు త్రిప్తీ. రీసెంట్‌గా ఓ అభిమాని దీపికను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రామ్‌లీలా సినిమా కోసం భారీ డ్రెస్ వేసుకొని, గాయలై… రక్తం కారుతున్నా, దీపిక సాంగ్ షూట్‌లో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. ఈ పోస్ట్‌ను త్రిప్తీ లైక్ చేయటంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఉందన్న వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కేర్ తో పాటు.. స్పీడు కూడా పెంచిన రవితేజ.. మోత మోగనున్న మాస్ జాతర
Yash: రెండేళ్లలో నాలుగు రిలీజ్‌లు.. బిగ్ స్కెచ్ రెడీ చేసిన రాకీభాయ్
టాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ షాక్.. అలా మైనస్ అవ్వడానికి గల కారణం ఏంటి
రూటు మారుస్తున్న సీనియర్ స్టార్స్.. కుర్ర హీరోలకు ఇక పోటీ తప్పదా ??
