Kalki 2: ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??

Updated on: Dec 06, 2025 | 2:15 PM

కల్కి 2898 AD సీక్వెల్ నుండి దీపిక పదుకొణె తప్పుకోవడంతో కొత్త హీరోయిన్‌పై చర్చ మొదలైంది. ప్రభాస్ పక్కన అనుష్క పేరు వినిపించినా, ఇప్పుడు ప్రియాంక చోప్రా కీలకమైన సుమతి పాత్రకు రంగంలోకి దిగుతారని వార్తలు వస్తున్నాయి. సరికొత్త ఆన్‌స్క్రీన్ జోడీలతో ప్రేక్షకులను ఉత్సాహపరచాలని మేకర్స్ భావిస్తున్నారు.

సినిమా కొత్తదైనప్పుడు స్క్రీన్‌ మీద జోడీలు మాత్రం పాత వాళ్లెందుకు? సరికొత్తగా కనిపిస్తే ఆడియన్స్ థ్రిల్‌ ఫీలవుతారు కదా.. ఇప్పుడు ఈ ఫార్ములాకే ఫిక్సవుతున్నట్టున్నారు ప్రభాస్‌. ఇంతకీ ఈయన ఆల్రెడీ పనిచేసిన హీరోయిన్లకు మరో ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టా? లేనట్టా? ఇప్పుడు టాలీవుడ్‌ డిస్కషన్‌ మొత్తం ప్రభాస్‌ కల్కి మూవీ గురించే. ఆ సీక్వెల్‌లో నటించే హీరోయిన్‌ గురించే. కల్కి సెకండ్‌ చాప్టర్‌ నుంచి దీపిక ఎందుకు తప్పుకుంటున్నారనే కారణాలు చెప్పకపోయినా సైలెంట్‌గా విషయాన్ని డిక్లేర్‌ చేసింది యూనిట్‌. మరి ఆమె నటించిన సుమతి కేరక్టర్‌ సెకండ్‌ పార్టులో చాలా కీలకం. సెకండ్‌ చాప్టర్‌లో దీపిక పాత్రలో ఎవరు నటిస్తారనే డిస్కషన్‌ షురూ అయింది. ఆల్రెడీ ప్రభాస్‌తో హిట్‌ జోడీగా పేరు తెచ్చుకున్న అనుష్క ఈ సినిమా కోసం రంగంలోకి దిగతారనే టాక్‌ వైరల్‌ అయింది. ఆ సినిమా కోసమే అనుష్క ప్రిపరేషన్‌లో ఉన్నారన్నది రీసెంట్‌ టైమ్స్ లో ఫిల్మ్ నగర్‌లో క్రేజీ న్యూస్‌. అదే జరిగితే ఈ సక్సెస్‌ఫుల్‌ కాంబోని మళ్లీ స్క్రీన్‌ మీద చూడొచ్చనుకున్నారు ఆడియన్స్. అయితే ఇప్పుడు ఆ కేరక్టర్‌ కోసం ప్రియాంక చోప్రాని అప్రోచ్‌ అవుతున్నారనే మాటలు స్పీడందుకున్నాయి. గ్లోబ్‌ ట్రాటర్‌ ఈవెంట్‌లో అందరినీ మెప్పించిన పీసీ, కల్కి2లో కేరక్టర్‌కి పర్ఫెక్ట్ అనుకుంటున్నారట మేకర్స్. ఆల్రెడీ స్పిరిట్‌లో త్రిప్తి దిమ్రితో నటిస్తున్నారు ప్రభాస్‌. ఇప్పుడు ప్రియాంక చోప్రాతో జోడితే.. రాబోయే సినిమాలన్నీ ఫ్రెష్‌ లుక్‌లో ఉంటాయని భావిస్తున్నారట

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అవతార్ 3 థియేటర్లలో మహేష్‌ !! హాలీవుడ్‌లో మార్కెట్‌ పై జక్కన్న మాస్టర్ ప్లాన్

iBomma Ravi: ఐ-బొమ్మ రవికి మేమేం జాబ్ ఆఫర్ చేయలే

TOP 9 ET News: అఖండ రిలీజ్‌ కోసం రెమ్యునరేషన్ ను వదులుకున్న బాలయ్య

స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!

వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్‌ డబ్బుల కోసం అన్ననే..

Published on: Dec 06, 2025 02:15 PM