Prabhas: వయనాడ్ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం

|

Aug 09, 2024 | 2:03 PM

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 300 మందికి పైగా చనిపోయారు. మరికొందరు గల్లంతయ్యారు. ఈ ప్రకృతి విపత్తు బాధితులను ఆదుకునేందుకు ప్రభాస్‌ భారీ విరాళ ప్రకటించాఉరు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రభాస్‌ రూ.2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. జులై 30న కురిసిన కుంభవృష్ఠితో వయనాడ్ జిల్లా అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడటంతో వందలాదిమంది మృతి చెందారు.

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 300 మందికి పైగా చనిపోయారు. మరికొందరు గల్లంతయ్యారు. ఈ ప్రకృతి విపత్తు బాధితులను ఆదుకునేందుకు ప్రభాస్‌ భారీ విరాళ ప్రకటించాఉరు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ప్రభాస్‌ రూ.2 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు. జులై 30న కురిసిన కుంభవృష్ఠితో వయనాడ్ జిల్లా అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడటంతో వందలాదిమంది మృతి చెందారు. వయనాడ్ ప్రకృతి విపత్తు నేపథ్యంలో ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ భారీ విరాళం ప్రకటించారు. రామ్ చరణ్, తాను కలిసి కోటి రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తున్నట్లు చిరంజీవి ఎక్స్ వేదికగా ఇటీవల వెల్లడించాడు. అల్లు అర్జున్ కూడా రూ.25 లక్షలు ఇస్తున్నట్లు వెల్లడించాడు. కమల్ హాసన్, సూర్య, జ్యోతిక, కార్తి, విక్రమ్, నయనతార, విఘ్నేష్ శివన్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ఫహాద్ ఫాజిల్ తదితరులు కూడా విరాళం ఇచ్చారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.10 కాయిన్‌ చెల్లదంటే చెరసాలే !! కఠిన చర్యలు తప్పవంటూ ఆర్బీఐ హెచ్చరికలు

చలియార్ నదిలో కొట్టుకొస్తున్న మానవ అవయవాలు

అణుయుద్ధమే జరిగితే ?? 72 నిమిషాల్లో 5 బిలియన్ల మంది ప్రాణాలొదిలే ప్రమాదం

అంత్యక్రియల పేరుతో మోసం శవాలను దాచేసి.. చితాభస్మంగా బూడిద ఇచ్చారు

 

Follow us on