Prabhas: ఇది కూడా లీక్ చేయడం ఏంట్రా.. ఏంటి బతకనివ్వరా ??

Updated on: Sep 10, 2025 | 1:05 PM

మన సెలబ్రిటీలకు, సెక్యూరిటో పెద్ద ఇష్యూగా మారిందిప్పుడు. నిత్యం వెంటాడే కెమెరాల మధ్య మన స్టార్ట్స్‌ హీరోలు సరిగ్గా తుమ్మలేని పరిస్థితి నెలకొంది. తమను వెంటాడే కెమెరాలను తప్పించుకుంటూ.. దొంగచాటుగా తిరగాల్సి వస్తోంది. ఇలాంటి ఈ పరిస్థితుల్లో.. ప్రభాస్‌ కు సంబంధించిన ఆధార్ కార్డ్ బయటికి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మన దేశంలోని వన్‌ ఆఫ్ ది.. అథెంటిక్ ఐడెంటిటీ కార్డ్ ఆధార్ కార్డ్. ఈ కార్డ్‌ ను మన దేశంలో చాలా పనులకు ఉపయోగిస్తారు. దీంతో ఈ కార్డ్‌ను మన ఆధార్‌ నెంబర్‌ను మిస్‌ చేసుకోకుండా చూసుకోవాల్సి బాధ్యత కూడా మనదే. గవర్నమెంట్ కూడా ఇదే చెబుతోంది. కానీ ప్రభాస్‌ విషయంలో మాత్రం కొందరు నెటిజన్లు ఆయన ఆధార్‌ కార్డును సోషల్ మీడియాలో పెట్టేశారు. కార్డ్ నెంబర్‌ను కానీ.. అడ్రెస్‌ను కానీ ఏమాత్రం బ్లర్ చేయకుండా… దాన్నో వీడియో తీసి.. నెట్టింట వైరల్ చేస్తున్నారు. అయితే ఇలా వైరల్ చేయడంపై కొందరు డార్లింగ్ ఫ్యాన్స్‌ రియాక్టవుతున్నారు. ఆధార్ కార్డను కూడా లీక్ అవడం పై సీరియస్ అవుతున్నారు. ఏంటి మా అన్నకు ప్రైవేసీ లేదా.. చూస్తుంటే బతకనిచ్చేలా లేదుగా అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Kajal Aggarwal: కాజల్‌కు చావు భయం చూపించిన.. పోకిరీ నెటిజన్స్‌ !!