Pawan Kalyan: పవర్‌ స్టార్‌ ప్లాన్ మార్చారా.. వరుస సినిమాలతో బిజీ కానున్నారా ??

Updated on: Oct 11, 2025 | 12:04 PM

OG విజయం తర్వాత పవన్ కళ్యాణ్ భవిష్యత్ సినిమా ప్రణాళికలపై ఆశలు చిగురించాయి. గతంలో రాజకీయాల్లో బిజీ అవుతారన్న ప్రచారం ఉన్నప్పటికీ, ఇప్పుడు సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త చిత్రాలపై కదలిక కనిపిస్తోంది. ఈ వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది.

OG సినిమా విజయం పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తించింది. ఈ చిత్రం విడుదల కావడానికి ముందు, పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సినిమాల నుంచి పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెడతారని విస్తృతంగా ప్రచారం జరిగింది. దీని కారణంగా అభిమానులు OG మానియాను పూర్తిగా ఆస్వాదించలేకపోయారు. అయితే, OG విడుదలైన తర్వాత పరిస్థితి మారిపోయింది. పవన్ కళ్యాణ్ భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో ఇన్నాళ్లూ ఎలాంటి కదలిక లేకపోయినా, ప్రస్తుతం సానుకూల వాతావరణం కనిపిస్తోంది. గతంలో చర్చల దశలోనే నిలిచిపోయిన సినిమాలు త్వరలో సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం మొదలైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గేరు మార్చిన టాప్‌ కెప్టెన్స్‌.. చిత్రాలను వేగంగా పూర్తి చేస్తున్న దర్శకులు

రీ రిలీజ్‌ సినిమాలకు మళ్లీ క్రేజ్‌.. రెడీ అయిన వరుస సినిమాలు

హీరోయిన్ల విషయంలో ఎందుకు వివక్ష అంటున్న దీపికా పదుకొనే

హిట్‌ పెయిర్స్‌కు పెరుగుతున్న క్రేజ్

తమిళనాడులో మన సినిమాలకు స్క్రీన్స్ లేవన్న కిరణ్ అబ్బవరం