Pooja Hegde: రీ ఎంట్రీ కోసం పూజా హెగ్డే తంటాలు

Edited By: Phani CH

Updated on: Oct 10, 2025 | 5:15 PM

సెకండ్ ఇన్నింగ్స్‌లో హీరోలకు ఉన్నంత డిమాండ్ హీరోయిన్లకు ఉండదంటారు. కానీ అది తప్పని ప్రూవ్ చేస్తుంది ఇక్కడ ఓ హీరోయిన్. మూడేళ్లుగా హిట్ లేకపోయినా.. రెండేళ్లుగా ఛాన్స్ రాకపోయినా.. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ అందుకంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు ఈ బ్యూటీ.  ఇంతకీ ఎవరా సుందరి..? ఓ టైమ్‌లో ఏ సినిమాకు డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్న పూజా హెగ్డే.. ఇప్పుడు ఏ సినిమాకు డేట్స్ ఇద్దామా అని వేచి చూస్తున్నారు.

చేతిలో ఉన్న సినిమాలు ఆడక.. కమిటైన సినిమాలు ఆగిపోయి.. సెలెక్ట్ అయిన సినిమాల నుంచి తప్పించి.. ఓ టైమ్‌లో చుక్కలు చూసింది పూజా. తెలుగులో ఈమె కెరీర్ పూర్తిగా గాడి తప్పింది. టాలీవుడ్ పట్టించుకోకపోవడంతో తమిళం, హిందీపై ఫోకస్ చేస్తున్నారు పూజా. ఈ మధ్యే తమిళంలో సూర్యతో నటించిన రెట్రో డిజాస్టర్ కావడం పూజాకు మరో దెబ్బ. కలిసొస్తుందనుకున్న కూలీ కూడా ఈమెకు పెద్దగా వర్క్ అవ్వలేదు. మోనిక సాంగ్ హిట్టైనా.. సినిమా ఫట్ అయింది. తెలుగులో చాలా రోజుల తర్వాత దుల్కర్ సల్మాన్‌ సినిమా సైన్ చేసారు పూజా. దుల్కర్ సినిమా కోసం ఏకంగా 2.5 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఫ్లాపుల్లో ఉన్నపుడు కూడా ఈ స్థాయి రెమ్యునరేషన్ అంటే చిన్న విషయం కాదు. ప్రస్తుతం ఈమె చేతిలో దుల్కర్‌తో పాటు విజయ్ జన నాయగన్ ఉన్నాయి. మరి పూజా ఈ రెండు సినిమాలతో కమ్ బ్యాక్ ఇస్తారా లేదా చూడాలిక.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Krithi Shetty: టాలెంట్ చూపిస్తున్న కృతి.. ఇప్పుడు ఉపయోగం లేదంటున్న ఫ్యాన్స్

Tamannaah Bhatia: అడ్వెంచర్ రోల్స్ కావాలంటున్న తమన్నా

వానాకాలానికి.. నో ఎండ్‌ వచ్చే రెండ్రోజులూ వానలే

జియో మరో సంచలనం.. రూ.799లకే సేఫ్టీ ఫోన్లు..విద్యార్థులకు ఫ్రీగా ఏఐ కోర్సు

షోరూం ముందే స్కూటీని తగలబెట్టిన యజమాని.. కారణం ఇదే..