Ram Gopal Varma: రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!

|

Nov 14, 2024 | 9:23 AM

ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్‌ స్టేషన్‌లో ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మపై పోలీస్‌ కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నవంబర్‌ 19న మద్దిపాడు పీఎస్‌లో విచారణకు హాజరుకావాలంటూ ప్రకాశంజిల్లా పోలీసులు రాంగోపాల్‌వర్మకు నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు.

ఇక వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రంబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్, నారా బ్రాహ్మణిలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎం.రామలింగం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటి యాక్ట్‌ కింద రాంగోపాల్‌వర్మపై నవంబర్‌ 10న ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వివాదాస్పద దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ.. రాజకీయాల నేపథ్యంలో రూపొందించిన వ్యూహం సినిమా రిలీజ్‍కు ముందే వివాదాలకు తెరతీసింది. ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికలకు ముందు రూపొందించిన ఈ సినిమా అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్‌ చేసేలా ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యూహం సినిమా.. విడుదలకు ముందే టీజర్, ట్రైలర్లతోనే రాజకీయ దూమారాన్ని రేపింది. తెలుగుదేశం పార్టీ ఈ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విడుదలను ఆపాలని నారా లోకేశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ సినిమా సెన్సార్‌ను తొలుత తెలంగాణా హైకోర్టు రద్దు చేసింది. అయితే డివిజన్‌ బెంచ్‌లో వర్మ సవాల్‌ చేయడంతో మరోసారి ఈ సినిమాను రివ్యూ చేసిన సెన్సార్‌బోర్డు యు సర్గిఫికెట్‌ ఇవ్వడంతో సినిమా రిలీజైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.