Ram Charan: నా కెరీర్ లోనే ఇది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్.. అంటున్న చెర్రీ

Edited By:

Updated on: Jan 20, 2026 | 4:02 PM

రామ్ చరణ్ 'పెద్ది' సినిమాపై మెగా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వింటేజ్ స్పోర్ట్స్ డ్రామా 'ఆట కూలీ' అనే వినూత్న కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తుంది. 'గేమ్ చేంజర్' నిరాశ తర్వాత చరణ్‌కు ఇది సోలో బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. షూటింగ్ చివరి దశలో ఉండగా, మార్చి 27న సినిమా విడుదల కానుంది.

రామ్‌ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద మెగా అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. గేమ్ చేంజర్‌ లాంటి డిజాస్టర్ తరువాత చేస్తున్న సినిమా కావటంతో చరణ్‌ కూడా చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నారు. గేమ్ చేంజర్‌ తరువాత మెగా అభిమానులు ఢీలా పడిపోయారు. చరణ్‌ నుంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చెర్రీ కూడా సోలోగా బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది సినిమాతో సిద్ధం మవుతున్నారు. రంగస్థలం తరువాత మరోసారి మాస్‌ విలేజ్‌ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు చెర్రీ. అంతేకాదు ఆట కూలీ అనే కొత్త కాన్సెప్ట్‌ను ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్‌కు పరిచయం చేయబోతున్నారు. అందుకే వింటేజ్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందుతున్న పెద్ది తన కెరీర్‌లోనే ఇంట్రస్టింగ్ క్యారెక్టర్ అన్నారు చరణ్‌. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్‌ ఫైనల్‌ స్టేజ్‌కు వచ్చేసింది. ప్యారలల్‌గా పోస్ట్‌ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లు సినిమాను మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఈ సినిమా చరణ్‌ కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నారు ఫ్యాన్స్‌.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హిట్టు కోసం పక్క చూపులు చూస్తున్న తమిళ దర్శకులు..

3 మేడలు, కారు, వడ్డీ వ్యాపారం.. ఈ బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్

టాయిలెట్‌లో పేపర్‌‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

SBI New Rules: రూల్స్‌ మార్చిన ఎస్‌బీఐ.. మళ్లీ చార్జీల మోత

Pomegranate Side Effects: ఈ సమస్యలు ఉన్నవారు దానిమ్మ తింటే.. ఇంక అంతే సంగతులు