Peddi: దూసుకుపోతున్న ‘పెద్ది’కి.. అదే పెద్ద పరీక్ష

Updated on: Jun 09, 2026 | 3:00 PM

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.300 కోట్ల మార్క్‌ను అందుకుని రికార్డుల వేట కొనసాగిస్తోంది. వీకెండ్ తర్వాత కూడా కలెక్షన్ల జోరు కొనసాగుతుండటంతో ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తోందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

పెద్దిగాడు బాక్సాఫీస్ ఛాంపియన్ అయ్యాడు. అందరూ అనున్నట్టే.. అందరూ చెప్పినట్టే.. కుప్పలు తెప్పలుగా కాసులు రాలుస్తున్నాడు. పెయిడ్ ప్రీమియర్స్ మొదలుకొని.. ఇవాళ్టి వరకు కలెక్షన్స్‌లో కొత్త రికార్డులు నమోదు చేస్తున్నారు. తన జోరుతో… అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న ఇండస్ట్రీని ఎగిరిగంతేసేలా చేస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే పెద్దికి అసలు పరీక్ష ఇప్పుడే మొదలైందని ఇండస్ట్రీలో కొందరు అంటున్నారు. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన పెద్ది మూవీ… జస్ట్ నాలుగు రోజుల్లోనే 300 కోట్ల మార్క్‌ను టచ్ చేసింది. రిలీజ్ డే నుంచి ఈ వీకెండ్ సండే వరకు ఫుల్ థియేటర్ యాక్యుపెన్సీతో రన్ అయింది. ఆల్ ఓవర్‌ వరల్డ్ మంచి హోల్డ్‌తో కలెక్షన్స్‌ను రాబడుతోంది. అయితే ఆఫ్టర్ వీకెండ్ ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అవుతుందా? అవదా? అన్నదానిపైనే ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది. వీక్ ఎండ్ సరే.. మరి వీక్ డేస్ కలెక్షన్స్‌ పైనే పెద్ది మూవీ హ్యూజ్ నెంబర్స్ తీసుకొస్తాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే అందుతున్న రిపోర్ట్ ప్రకారం పెద్ది మూవీ సోమవారం కూడా మంచి థియేటర్‌ రన్‌ను నమొదు చేసింది. సమ్మర్ హాలీడేస్, మరే పెద్ద సినిమా పెద్దికి పోటీ లేకపోవడం వంటి రీజన్స్ వల్ల.. పెద్ది మరో వారం రోజుల పాటు.. ఇదే రేంజ్‌లో థియేటర్‌లను రఫ్పాడించేట్టు కనిపిస్తోంది. ఒక వేళ ఇదే కనుక జరిగే.. పెద్ది ఇండస్ట్రీ హిట్ గా హిస్టరీ కెక్కడం.. ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోయడం పక్కా అనే చెప్పాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వందేభారత్‌కు తప్పిన పెను ప్రమాదం!

తెలంగాణ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. మారిన స్కూల్‌ రీ ఓపెనింగ్‌ డేట్‌

రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.. క్లారిటీ ఇచ్చిన నటుడు!

కన్నవారిని గెంటేసిన కొడుకు.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. 300 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ!

Follow Us