Ustaad Bhagat Singh: ఊహించని షాక్ ఇచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్

Edited By: Phani CH

Updated on: Dec 04, 2025 | 5:05 PM

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దశాబ్దం తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో డాన్స్‌తో సందడి చేయనున్నారు. రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్, మళ్ళీ తెరపై స్టెప్పులేయడం అభిమానులకు గొప్ప సర్‌ప్రైజ్. వింటేజ్ పవన్ కళ్యాణ్ స్టైల్, స్వాగ్, కామెడీ ఈ సినిమాలో ఉంటాయని దర్శకుడు హరీష్ శంకర్ హామీ ఇస్తున్నారు. డిసెంబర్‌లో మొదటి సింగిల్ రానుంది.

డిప్యూటీ సిఎం అయ్యాడు డాన్సులేం చేస్తాడు.. పొలిటికల్‌గా బిజీ అయ్యారు ఎంటర్‌టైన్మెంట్ ఏం చేస్తాడులే అనుకుంటున్నారా…? ఇప్పటికీ అదే స్టైల్, స్వాగ్.. స్టెప్పేస్తే థియేటర్స్ ఊగిపోవాల్సిందే.. కామెడీ చేస్తే కడుపులు చెక్కలవ్వాల్సిందే అంటున్నారు పవన్ కళ్యాణ్. ఆ బాధ్యత నాదీ అంటున్నారు హరీష్ శంకర్. అసలు ఈ ఇద్దరూ కలిసి ఏం చేస్తున్నారో చూద్దామా..? పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన నుంచి సినిమా కోరుకోవడం ఆశ.. అందులో డాన్స్ కూడా చేయాలనుకోవడం అత్యాశ..! అసలీ మధ్య కాదు.. కొన్నేళ్లుగా డాన్స్ చేయడమే పూర్తిగా మానేసారు పవర్ స్టార్. అప్పుడే చేయలేదు.. ఇప్పుడేం చేస్తారని ఫ్యాన్స్ కూడా డిసైడ్ అయిపోయారు. ఇలాంటి సమయంలో అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇస్తున్నారు డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద జస్ట్ అలా కనిపిస్తేనే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు.. అలాంటిది ఆయన డాన్స్ చేస్తే ఇంకేమైనా ఉందా..? కొన్నేళ్లుగా డాన్సులకు పూర్తిగా దూరంగానే ఉన్న పవర్ స్టార్.. ఉస్తాద్‌లో చిందేయడానికి రెడీ అయిపోయారు. దాదాపు దశాబ్ధం తర్వాత స్టెప్పులేయబోతున్నారు పవన్. మొన్న విడుదలైన స్టిల్ కూడా ఆ పాటలోనిదే.. ఇప్పుడు వీడియో వచ్చింది. చూస్తున్నారుగా.. ఇందులో పవన్ స్వాగ్..! బ్లాక్ అండ్ బ్లాక్‌లో ఆయన్ని చూస్తుంటే మామూలుగా లేదంటున్నారు ఫ్యాన్స్. ఇన్‌బిల్ట్ స్వాగ్‌తో పవన్ జస్ట్ అలా రెండు స్టెప్పులేసినా థియేటర్స్ ఊగిపోతాయి. నా మాట నమ్మండి.. ఉస్తాద్‌లో ఇలాంటి స్టెప్పులు బోలెడుంటాయి అంటున్నారు హరీష్ శంకర్. ఉస్తాద్‌లో వింటేజ్ పవన్ కనిపిస్తారంటున్నారు ఈ దర్శకుడు. అత్తారింటికి దారేది తర్వాత పవన్ డాన్స్ చేసింది తక్కువే.. చేసినా ఒకట్రెండు స్టెప్పులే. ఉస్తాద్‌లో దేవీ ఫాస్ట్ బీట్స్‌ విన్నాక.. తనకు డాన్స్ చేయాలనిపిస్తుందంటున్నారు పవర్ స్టార్. డిసెంబర్‌లోనే ఫస్ట్ సింగిల్ రానుంది. గబ్బర్ సింగ్‌కు మించి దీన్ని ప్లాన్ చేస్తున్నారు హరీష్. మొత్తానికి ఉస్తాద్‌ భగత్ సింగ్‌లో పవన్ డైలాగులే కాదు.. డాన్సులు కూడా ఉంటాయన్నమాట.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సెలబ్రిటీ వెడ్డింగ్‌లో కనిపిస్తున్న ఎరుపు రంగు చీరలు

Samantha: సమంత పెళ్లి వెనక పెద్ద కథే ఉందిగా

Akhanda 2: బాలయ్యకు గుడ్‌ న్యూస్ ఏపీలో బెనిఫిట్ షోలకు ఆ ధరకు గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో?

‘ఆ టాలీవుడ్ హీరో భార్య నుంచి రక్షించండి’ పోలీస్‌ స్టేషన్‌కు శేఖర్ బాషా!

సామ్‌ లాగే ‘భూత శుద్ది వివాహం’ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా ??