పవన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగిన హరి హర వీరమల్లు
పవన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్! మరో రెండు మూడు రోజుల్లో థియేటర్లో పవన్ మేనియాను విట్ నెస్ చేద్దామనుకున్న ఫ్యాన్స్‌ను డిస్సపాయింట్ చేసేలా హరి హర మూవీ టీం నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ను నిజం చేసేసింది. ఏఎమ్ రత్నం ప్రొడక్షన్లో... ఆయన కొడుకు జ్యోతి కృష్ణ డైరెక్షన్లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న హరి హర వీర మల్లు సినిమా పోస్ట్ పోన్ అయింది.
ముందు నుంచి మేకర్స్ చెబుతున్నట్టు హరి హర మూవీ.. జూన్ 12న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఈ చిత్రాన్ని మరింత గొప్పగా మలిచే క్రమంలో… హరి హర వీర మల్లు సినిమా రిలీజ్‌ను వాయిదా వేయక తప్పడం లేదంటూ… ఈ మూవీ టీం నుంచి ఓ అఫీషియల్ న్యూస్ బయటికి వచ్చింది.
గత కొన్ని రోజుల నుంచి హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆ న్యూస్‌ను నిజం చేస్తూ.. మేకర్స్ నుంచి అఫీషియల్ పోస్ట్ పోన్ న్యూస్ బయటికి వచ్చింది. ఆ న్యూస్ కాస్తా పవన్ ఫ్యాన్స్ తో పాటు ఫిల్మ్ లవర్స్‌ను డిస్సపాయింట్ చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :