Bandla Ganesh: ఓజీ డైరెక్టర్‌కు కాస్ల్టీ గిఫ్ట్‌ ఇచ్చిన పవన్.. బండ్ల గణేశ్ ట్వీట్ వైరల్

Updated on: Dec 20, 2025 | 6:35 PM

పవన్ కళ్యాణ్ ఓజీ దర్శకుడు సుజిత్‌కు కారు బహుమతిగా ఇవ్వడంపై బండ్ల గణేష్ స్పందించారు. 'మీకు కారు ఇచ్చారు, నాకు జీవితమే ఇచ్చారు' అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. పవన్ పట్ల తనకున్న అపారమైన అభిమానాన్ని, ఆయనను దేవుడిగా కొలిచే తన భావనను బండ్లన్న మరోసారి చాటుకున్నారు. ఈ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఇప్పుడు సినిమాలేవీ చేయడం లేదు. కానీ సినిమా ఈవెంట్లకు హాజరవుతున్నాడు. అక్కడ హీరోలను ఉద్దేశించి అతను చేసే కామెంట్స్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి. కొన్ని సార్లు కాంట్రవర్సీకి కూడా దారి తీస్తున్నాయి. ఆ మధ్యన కిరణ్ అబ్బవరం కే- ర్యాంప్ సక్సెస్ ఈవెంట్ లో ఓ టాలీవుడ్ హీరోనూ ఉద్దేశిస్తూ బండ్లన్న చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇక సోషల్ మీడియాలోనూ ఆసక్తికరమైన పోస్టులు పెడుతుంటాడు బండ్ల గణేశ్. అలా తాజాగా ఆయన ట్విట్టర్ (ఎక్స్ )లో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల పవన్ కల్యాణ్ ఓజీ డైరెక్టర్ సుజిత్ కు ఖరీదైన కారును కానుకగా ఇచ్చారు. ఓజీ రూపంలో తనకు సూపర్ హిట్ సినిమా ఇచ్చినందుకుగానూ పవన్ ఈ కారును సుజిత్ కు బహుమతిగా అందించారు. ఈ కారు ధర సుమారు రూ. కోటి వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే విషయంపై బండ్ల గణేశ్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ పెట్టాడు. పవన్ కళ్యాణ్ సుజిత్ కారుతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసిన బండ్లన్న..’కంగ్రాట్యులేషన్స్.. మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు’ అంటూ పోస్ట్ పెట్టారు బండ్లన్న. కాగా పవన్ కల్యాణ్ ను అమితంగా ఆరాధిస్తాడు బండ్ల గణేశ్. పవర్ స్టార్‌ని ఏకంగా దేవుడితో పోలుస్తుంటారు బండ్లన్న. ఏదైనా సినిమా ఈవెంట్ కు వెళితే పవనామస్మరణతో రెచ్చిపోతుంటాడీ నిర్మాత. ఇప్పుడు పవన్ కల్యాణ్ తనకు జీవితమిచ్చారంటూ మరోసారి డిప్యూటీ సీఎంపై తన అభిమానాన్ని చాటుకున్నాడు బండ్ల గణేశ్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరలవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Chinmayi: వాళ్లందరూ జంతువుల కన్నా హీనం..! నిధికి సపోర్ట్‌గా ఫ్యాన్స్‌పై చిన్మయి ఆగ్రహం

Bigg Boss Kalyan: ఇప్పటికైతే కళ్యాణ్ టాప్..! కానీ కట్టప్ప తనూజ పక్కనే ఉందిగా

కమెడియన్ హీరోగా మారుతున్న వేళ ?? గెలుపుపై తీవ్ర ఉత్కంఠ

AIతో అసభ్యంగా చిత్రీకరిస్తే వదలను! హీరోయిన్ హెచ్చరిక

రాజాసాబ్ ఈవెంట్‌ పై.. పోలీసులు సీరియస్