పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్ ఇచ్చినా.. ఈ ఇద్దరు హీరోయిన్ల కెరీర్‌కు మాత్రం సక్సెస్ కలిసిరాలేదే!

Edited By:

Updated on: Aug 16, 2026 | 8:21 PM

పాన్ ఇండియా స్థాయిలో భారీ బ్లాక్‌బస్టర్స్‌లో నటించినా శ్రీనిధి శెట్టి, సారా అర్జున్ కెరీర్లు ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. కేజీఎఫ్‌తో శ్రీనిధికి, ధురంధర్‌తో సారా అర్జున్‌కు గుర్తింపు వచ్చినప్పటికీ, ఆ తర్వాత చెప్పుకోదగ్గ అవకాశాలు పెద్దగా దక్కలేదు. హీరోల ఇమేజ్ ముందు వారి పాత్రలు అంతగా హైలైట్ కాకపోవడం, సరైన ప్రాజెక్ట్ ఎంపిక లేకపోవడం కెరీర్‌పై ప్రభావం చూపిందనే చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో వీరి కెరీర్లు మలుపు తిరుగుతాయేమో చూడాలి.

పాన్ ఇండియా హిట్స్ పడితే స్టార్‌డమ్ ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతుందంటారు కానీ ఆ ఇద్దరు ముద్దుగుమ్మలకు మాత్రం ఆ సక్సెస్ శాపంగా మారింది. ఇండియా షేకయ్యే రేంజ్ బ్లాక్‌బస్టర్స్‌లో భాగమైనా.. వాళ్ల కెరీర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మిగిలిపోయింది. మరి అరుదైన విజయాల అనంతరం కూడా అలాగే ఉండిపోయిన ఆ బ్యూటీస్ ఎవరో తెలుసా..? కేజీఎఫ్ సినిమాతో యశ్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయి పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు.. కానీ అందులో నటించిన శ్రీనిధి శెట్టికి మాత్రం ఆ మ్యాజిక్ ఏమాత్రం కలిసిరాలేదు. ఆ భారీ విజయం తర్వాత కూడా ఈ కన్నడ బ్యూటీ కెరీర్ అక్కడే ఉంది. ప్రస్తుతం వెంకటేష్‌తో ‘ఆదర్శ కుటుంబం’లో నటిస్తున్నారు. ఈ సినిమాతో అయినా తన దశ తిరుగుతుందని నమ్ముతున్నారు శ్రీనిధి. అలాగే రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.. ఆయన ఇమేజ్‌ను అమాంతం పెంచేసింది ఆ సినిమా. కానీ అందులో హీరోయిన్‌గా నటించిన సారా అర్జున్ పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన ఈ భామకు.. కొత్తగా చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ రాకపోవడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. బ్లాక్‌బస్టర్స్ పడినా.. టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా ఉంటేనే హీరోయిన్ల కెరీర్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్‌గా ముందుకు సాగుతుందనడానికి వీళ్లే నిదర్శనం. హీరోల ఇమేజ్ ముందు వీళ్ల పాత్రలు పెద్దగా హైలైట్ కాకపోవడం.. పర్ఫెక్ట్ ప్లానింగ్ లేకపోవడంతో శ్రీనిధి, సారా అర్జున్ కెరీర్స్ అక్కడే ఆగిపోయాయి. మరి ఫ్యూచర్‌లో అయినా మ్యాజిక్ జరుగుతుందేమో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తుపాకులు వదిలి ర్యాంప్‌పైకి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు..

ఆధార్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. అప్‌డేట్‌కు ఇక సెంటర్‌ అవసరం లేదు

ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వారి వల్ల కాలేదు.. చివరికి ఇలా..!

ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు!

మీ ఇంట సిరులు కురిపించే మొక్క! ఈ రోజులు, దిశలో నాటాలి గుర్తుంచుకోండి

Loading...
Unable to load recommendations.
Follow Us