Jr NTR : నా పేరు వాడేటప్పుడు జాగ్రత్త! హెచ్చరించిన NTR
ఢిల్లీ హైకోర్టు జూ.ఎన్టీఆర్ వ్యక్తిత్వ మరియు పబ్లిసిటీ హక్కులకు రక్షణ కల్పించింది. తన అనుమతి లేకుండా ఎన్టీఆర్ పేరు, ఫోటోలు, నిక్‌నేమ్‌లను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించరాదని కోర్టు స్పష్టం చేసింది. వాణిజ్యపరమైన వినియోగంపై నిషేధం విధించడంతో ఎన్టీఆర్ ఐడెంటిటీ దుర్వినియోగం కాకుండా హైకోర్టు సమర్థవంతమైన తీర్పు ఇచ్చింది. ఇది నటుడి హక్కుల పరిరక్షణకు ఒక ముఖ్యమైన చట్టపరమైన విజయం.
ఇటీవల తన పర్సనాలిటీ… అండ్ పబ్లిసిటీ రైట్స్ ను కాపాడుకునేందుకు ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కిన ఎన్టీఆర్‌కు కోర్టు నుంచి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ మేరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంపౌండ్ నుంచి ఓ అఫీయల్ నోట్ రిలీజ్ అయింది. ఇక ఆ నోట్‌లో.. ఇక పై తన అనుమతి లేకుండా ఎన్టీఆర్ పేరుతో పాటు ఆయన ఫోటోలను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకోవడం నేరమని కోర్టు తెలిపింది.దీనివల్ల ఆయన హక్కులకు భంగం కలుగుతోందని కోర్టు అభిప్రాయపడింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, హైకోర్టు ఆయన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పించింది. NTR, Jr. NTR, NTR Jr, Tarak, Nandamuri Taraka Rama Rao Jr., Jr. Nandamuri Taraka Rama Rao వంటి పేర్లతో పాటు Man of Masses, Young Tiger అనే నిక్ నేమ్స్‌ను ఎవరూ ఉపయోగించరాదని కోర్టు సూచించింది. వాణిజ్యపరంగా ఆయన అనుమతి లేకుండా ఎవరైనా ఈ పేర్లను ఉపయోగించి ఉంటే చట్ట ప్రకారం తొలగించాలని కోర్టు ఆదేశించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varanasi: నేషనల్ లెవల్ లో ట్రెండ్ అవుతున్న వారణాసి
Krithi Shetty: సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న కృతి శెట్టి
కోలీవుడ్ లో స్టార్ వారసుల సందడి
Pragya Jaiswal: స్టార్ ఇమేజ్ కోసం ఆ విధంగా ట్రై చేస్తున్న ప్రగ్యా జైశ్వాల్
Anil Ravipudi: నెక్ట్స్ మూవీకి ఆ హీరోని రెడీ చేస్తున్న అనిల్ రావిపూడి ?
