Chalaki Chanti: ఆసుపత్రిలో పడి ఉంటే.. ఎవరూ పట్టించుకోలేదు.! చలాకి చంటి ఎమోషనల్

|

Oct 15, 2024 | 3:33 PM

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో చలాకీ చంటి ఒకరు. అంతకు ముందు పలు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించాడీ స్టార్ కమెడియన్. ఆ తర్వాతే జబర్దస్త్ లో అడుగు పెట్టి టీమ్ లీడర్ అయ్యారు. చలాకీ చంటిగా ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. బిగ్ బాస్‌ షోలోనూ కంటెస్టెంట్ గా బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెల్చుకున్నాడు.

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో చలాకీ చంటి ఒకరు. అంతకు ముందు పలు సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించాడీ స్టార్ కమెడియన్. ఆ తర్వాతే జబర్దస్త్ లో అడుగు పెట్టి టీమ్ లీడర్ అయ్యారు. చలాకీ చంటిగా ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. బిగ్ బాస్‌ షోలోనూ కంటెస్టెంట్ గా బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెల్చుకున్నాడు. ఇక పలు టీవీషోలకు హోస్ట్ గానూ మెప్పించాడు. ఇలా జబర్దస్త్ షో, సినిమాలతో బిజీ బిజీగా ఉండే చంటి గతేడాది తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. హార్ట్ అటాక్ తో ఆస్పత్రిలో చేరాడు. అప్పటి నుంచి సినిమా పరిశ్రమకు దూరంగా ఉన్న చలాకీ చంటి ఇప్పుడిప్పుడే బయట కనిపిస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ స్టార్ కమెడియన్ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి షాకింగ్ విషయాలు పంచుకున్నాడు.

తాను హార్ట్ అటాక్ తో ఆస్పత్రిలో చేరినప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సాయం అందలేదన్నాడు చంటీ. అంతేకాదు కనీసం తనను ఎవరూ పలకరించలేదని ఎమోషనల్ అయ్యాడు. కొంతమంది మాత్రమే ఫోన్ చేసి జాగ్రత్త అని చెప్పారన్నాడు. ఈ రోజుల్లో డబ్బులు ఉంటేనే బతుకుతామనే విషయం తన పరిస్థితి వల్ల తనకు బోధపడిందన్నాడు. డబ్బులు లేకపోతే ఎవరూ వచ్చి హెల్ప్ చేయరంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. తనే కాదు ప్రతి ఆర్టిస్ట్ లైఫ్ ఇంతే అన్నాడు. మనం కూడా ఎవరి దగ్గరా సాయం ఆశించకూడదని.. స్నేహితులే అయినా డబ్బు విషయంలో హెల్ప్ చేయరంటూ.. షాకింగ్ అండ్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు ఈ స్టార్ కమెడియన్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.