కొత్త పెళ్లికొడుకుకి ఎన్టీఆర్ స్పెషల్ సర్‌ప్రైజ్‌

Updated on: Oct 16, 2025 | 4:52 PM

జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్థి నార్నె నితిన్- శివానీ అక్టోబర్ 10న పెళ్లి పీటలెక్కారు. అక్టోబర్ 10 రాత్రి హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లిలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి, కల్యాణ్ రామ్, దగ్గుబాటి వెంకటేష్, రానా, సురేశ్‌ బాబు, రాజీవ్ కనకాల తదిరులు నితిన్ పెళ్లి వేడుకలో సందడి చేశారు.

నార్నె నితిన్ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలయ్యాయి. కాగా తన బామ్మర్ది పెళ్లి ఏర్పాట్లను జూనియర్ ఎన్టీఆర్ దగ్గరుండి మరీ చూసుకున్నాడట. అంతేకాదు నితిన్ కు పెళ్లి కానుకగా ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ కూడా ప్లాన్ చేశాడని టాక్ వినిపిస్తోంది. ఒక లగ్జరీ కారును నితిన్ – శివానీ దంపతులకు పెళ్లి కానుకగా ఇవ్వబోతున్నాడట. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట బాగా వైరలవుతోంది. కాగా నితిన్ పెళ్లిలో ఎన్టీఆర్ ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.ముఖ్యంగా ఎన్టీఆర్ తనయులు అభయ్, భార్గవ్‌ల సందడి మామూలుగా లేదు. ప్రముఖ బిజినెస్ మ్యాన్ నార్నె శ్రీనివాసరావు కుమారుడే నార్నె నితిన్. ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతికి సోదరుడు. 2023లో ‘మ్యాడ్’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయ్ సినిమాతో మరో హిట్ కొట్టాడు. ఇక ఈ ఏడాది ‘మ్యాడ్ స్క్వేర్’తో హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నాడు.ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. ఇటీవలే వార్ 2 సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగులో బిజీగా ఉంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంత అమాయకురాలినేం కాదు.. దీపిక తీరుపై మాజీ మంత్రి స్ట్రాంగ్ కౌంటర్

హీరోయిన్‌కు వింత రోగం.. చెప్పుకోలేక.. భరించలేక తీవ్ర ఇబ్బంది

Published on: Oct 16, 2025 02:04 PM