అన్నయ్యకు హిట్టు ఇచ్చేందుకు.. బరిలోకి దిగిన చెల్లెలు
మెగా డాటర్ నిహారిక కొణిదెల 'కమిటీ కుర్రాళ్లు'తో నిర్మాతగా అడుగుపెట్టి, ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. తన అన్నయ్య వరుణ్ తేజ్‌తో కలిసి 'బరి' అనే గ్రామీణ నేపథ్య స్పోర్ట్స్ డ్రామాను నిర్మిస్తున్నారు. 'కమిటీ కుర్రాళ్లు' దర్శకుడు యదు వంశీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ లాంచ్ చేశారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం 'కొరియన్ కనకరాజు'తో బిజీగా ఉన్నారు.
మెగా డాటర్ అన్న.. ట్యాగ్ పక్కన పెట్టి మరీ.. ‘కమిటీ కుర్రాళ్లు’ అనే చిన్న సినిమాతో ప్రొడ్యూసర్‌గా సక్సెస్ సాధించిన నిహారిక.. చూస్తుండగానే.. పెద్ద ప్రొడ్యూసర్‌గా ఎదిగిపోయారు. ఏకంగా పాన్ ఇండియా సినిమాను ప్రొడ్యూస్ చేసే రేంజ్‌కు ఎదిగిపోయారు. ఉన్నట్టుండి.. తన అన్నయ్య మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో ఇప్పుడు సినిమా మొదలెట్టేశారు. కమిటీ కుర్రాళ్లు సినిమాతో.. డైరెక్టర్‌గా ఛాన్స్ ఇచ్చిన యదు వంశీకే నిహారిక మరో అవకాశం ఇచ్చారు. ఆయన చెప్పిన స్పోర్ట్స్ డ్రామా స్క్రిప్ట్ నచ్చడంతో… తన అన్న వరుణ్ తేజ్‌నే హీరోగా పెట్టి.. ‘బరి’ సినిమాను ప్లాన్ చేశారు నిహారిక. తన బాబాయ్ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా బరి సినిమాను కూడా మొదలెట్టారు. ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగనుందని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. వరుణ్ తేజ్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇదే ఏడాదిలో ఈ చిత్రం విడుదల కానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ustaad Bhagat Singh: నార్త్ అమెరికాలో ఉస్తాద్‌కు.. షాకిచ్చేలా.. కలెక్షన్స్
యాక్టింగ్ నేర్పించి, సినిమా ఛాన్స్ ఇస్తే.. నా పైనే నిందలా..!
రిషబ్ Vs రుక్మిణి.. తెర వెనుక ఏదో జరుగుతోందబ్బా…?
తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. DL, RC కార్డులు ఇక నేరుగా మీ ఇంటికి
