Chinmayi: వాళ్లందరూ జంతువుల కన్నా హీనం..! నిధికి సపోర్ట్‌గా ఫ్యాన్స్‌పై చిన్మయి ఆగ్రహం
లూలూ మాల్‌లో 'రాజా సాబ్' పాట లాంచ్ సందర్భంగా నిధి అగర్వాల్‌కి జరిగిన చేదు అనుభవం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫ్యాన్స్ ఆమెపై ఎగబడటంతో, సరైన సెక్యూరిటీ లేకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సింగర్ చిన్మయి ఈ ఘటనపై ఘాటుగా స్పందిస్తూ, ఇలాంటి వారిని "మానవ మృగాలు"గా అభివర్ణించారు. ఈ సంఘటనపై నెటిజన్లు కూడా మేకర్స్‌ను ప్రశ్నిస్తున్నారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే వీడియో కనిపస్తోంది. లూలూ మాల్‌లో ఫ్యాన్స్ ఎగబడడంతో.. నిస్సహాయ స్థితిలో నిధి పడిన వేదన.. ఆ వీడియో స్పష్టంగా కనిపిస్తూ.. అందర్నీ షాకయ్యేలా చేస్తోంది. ఇది నిజంగా దారుణం అనే కామెంట్ వస్తోంది. ఈ క్రమంలోనే ఇదే సంఘటన పై సింగర్ చిన్మయి కూడా రియాక్టయ్యారు. ఎప్పటిలానే తను కూడా కాస్త ఘాటుగా.. ఓ ట్వీట్ చేశారు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు చిన్మయి. తనను కలిచివేసే విషయాలపై చాలా క్లియర్‌గా స్పందిస్తుంటారు. ఆ క్రమంలో ట్రోల్స్‌కు గురైనా వెనకడుగు వేయకుండా వాటిని కూడా ఎదుర్కొంటుంటారు. అలాంటి ఈ స్టార్ సింగర్.. రాజా సాబ్ సాంగ్ లాంచ్ సందర్భంగా.. నిధి అగర్వాల్‌కు ఎదురైన చేదు అనుభవం గురించి ట్వీట్ చేశారు. ఆ హీరోయిన్ చుట్టూ ఎగబడే వాళ్లందరూ మగాళ్లు కాదు, జంతువులు…జంతువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి మానవ మృగాళ్లని వేరే గ్రహానికి పంపాలంటూ మండిపడ్డారు సింగర్ చిన్మయి. ప్రస్తుతం ఈమె పెట్టిన పోస్ట్ కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం పక్కకు పెడితే.. నిధి అగర్వాల్‌కు జరిగన చేదు అనుభవం పై సోషల్ మీడియాలో ఇప్పటికే రచ్చ మొదలైంది. చాలా మంది నెటిజన్లు ఈ విషయంలో మేకర్స్‌ను తప్పుబడుతున్నారు. భారీ ఫ్యాన్ బేస్ ఉన్న ప్రభాస్ సినిమా ఈవెంట్ కోసం ఓ మాల్‌ను ఎంచుకోవడాన్ని.. అందులోనూ హీరోయిన్ కు సరియైన సెక్యూరిటీ పెట్టకపోవడాన్ని వాళ్లు తమ పోస్టుల్లో వేలెత్తి చూపిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bigg Boss Kalyan: ఇప్పటికైతే కళ్యాణ్ టాప్..! కానీ కట్టప్ప తనూజ పక్కనే ఉందిగా
కమెడియన్ హీరోగా మారుతున్న వేళ ?? గెలుపుపై తీవ్ర ఉత్కంఠ
AIతో అసభ్యంగా చిత్రీకరిస్తే వదలను! హీరోయిన్ హెచ్చరిక
