రాజాసాబ్ ఈవెంట్ పై.. పోలీసులు సీరియస్
హైదరాబాద్‌లో ‘ది రాజా సాబ్’ పాటల విడుదలకు నిధి అగర్వాల్ హాజరైనప్పుడు కొందరు అభిమానులు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవెంట్ నిర్వాహకులు, మాల్‌పై సరైన అనుమతులు లేనందుకు కేసులు నమోదయ్యాయి. సింగర్ చిన్మయి సహా పలువురు సినీ ప్రముఖులు ఈ తీరును ఖండించారు. ఈ విషయం ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
హీరోయిన్ నిధి అగర్వాల్ పట్ల కొందరు అభిమానులు ప్రవర్తించిన తీరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సింగర్ చిన్మయి తదితర సినీ ప్రముఖులు అభిమానుల తీరును తప్పుపడుతున్నారు. డిసెంబర్ 17న హైదరాబాద్ లో ‘ది రాజా సాబ్’ సినిమా పాటల విడుదల కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. ఒక ప్రైవేట్ మాల్ లో ఏర్పాటు చేసిన సాంగ్ రి లీజ్ ఈవెంట లో హీరోయిన్ నిధి అగర్వాల్ పాల్గొంది. ఆ సమయంలో , పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. చాలా మంది అభిమానులు ఒకేసారిగా నిధి అగర్వాల్ తో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. ఇదే సమయంలో కొంతమంది ఆమెతో అసభ్యకరంగా, దురుసుగా ప్రవర్తించారు. ఇప్పుడు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ‘ది రాజా సాబ్’ చిత్రంలోని ‘సహానా సహానా..’ పాట విడుదలైంది. ఈ పాటను డిసెంబర్ 17న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమం చాలా ఆలస్యం అయింది. ఆ సమయానికి, భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. ఇదే క్రమంలో నిధి అగర్వాల్ పట్ల కొందరు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. సరైన అనుమతి లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మాల్ తో పాటు ఈవెంట్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈసారి బిగ్‌బాస్ విన్నర్ ఎవరో చెప్పేసిన నిఖిల్..
Taapsee Pannu: జుట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలతో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చిన తాప్సీ
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కొత్తగా పుట్టిన కొడుకే వారసుడని షాకింగ్ ప్రకటన
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్ ఉన్న గూఢాచార పక్షి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్
