Nayanthara: నయనతారకు మాత్రమే అదెలా సాధ్యం..?

Edited By:

Updated on: Jan 02, 2026 | 3:40 PM

నయనతార 40 ఏళ్లు దాటినా కూడా సౌత్ ఇండియాలో నంబర్ వన్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. ఆమె సమకాలీన నటీమణులు క్యారెక్టర్ రోల్స్‌కు మారినా, నయనతార తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. గ్లామర్, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను బ్యాలెన్స్ చేస్తూ, సీనియర్ హీరోలకు మొదటి ఛాయిస్‌గా మారారు. ఒక్కో సినిమాకు రూ.15 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటూ, తన కెరీర్ దూకుడును కొనసాగిస్తున్నారు. ఆమె విజయ రహస్యం ఏమిటి?

40 దాటిన తర్వాత కూడా నయనతార ఇంకా నెంబర్ వన్ హీరోయిన్‌గా ఎలా ఉన్నారు..? ఆమెతో పాటు వచ్చిన భామలంతా సపోర్టింగ్ క్యారెక్టర్స్‌కు షిప్ట్ అయిపోయినా.. నయన్ మాత్రమే ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు..? మిగిలిన ముద్దుగుమ్మల్లో లేనిదేంటి.. నయనతారలో మాత్రమే ఉన్నదేంటి..? ఆ స్పెషల్ క్వాలిటీతోనే నయన్ దున్నేస్తున్నారా..? 40 ఏళ్లలోనూ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఉండటం అనేది చిన్న విషయం కాదు.. కానీ తనకు ఇవన్నీ మామూలే అంటున్నారు నయనతార. ఈ భామ దూకుడు ముందు కుర్ర హీరోయిన్లు సైతం నిలబడలేకపోతున్నారు. ఒక్కో సినిమాకు 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ.. చాలా మంది హీరోయిన్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు నయన్. ప్రస్తుతం అరడజన్ సినిమాలతో బిజీగా ఉన్నారు. రెమ్యునరేషన్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు నయనతార. ఆమె ఎన్ని కండీషన్స్ పెట్టినా.. నిర్మాతలే కాంప్రమైజ్ అవుతుంటారు. పండక్కి మన శంకరవరప్రసాద్ గారు అంటూ చిరుతో కలిసి వస్తున్నారు నయన్. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే అనిల్ వర్కింగ్ స్టైల్‌కు నయనతార ఫిదా అయిపోయారు. సినిమాలోనూ నయన్ లుక్స్ అదిరిపోయాయి. మామూలుగా అంత ఈజీగా ఏ దర్శకుడిని ప్రశంసించని నయన్.. అనిల్ రావిపూడికి వర్కింగ్ స్టైల్‌కి పడిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా టాక్సిక్ నుంచి నయనతార లుక్ విడుదలైంది. అందులో ఆమె గ్లామర్ షోతో మతులు చెడగొడుతున్నారు. ఓవైపు గ్లామర్ డోస్ చూపిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం కేవలం నయన్‌కు మాత్రమే చెల్లింది. అనుష్క పెద్దగా కనిపించట్లేదు.. తమన్నా స్పెషల్ సాంగ్స్‌కు సెట్టయ్యారు.. త్రిష మునపటి ఫామ్‌లో లేదు.. సమంత ఓటిటికి వెళ్లారు.. కాజల్ సైడ్ అయిపోయారు.. కానీ నయన్ మాత్రం నేటికి టాప్‌లోనే ఉన్నారు. ఎందుకంటే సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ ఛాయిస్ అయ్యారు కాబట్టి. రేపు చిరంజీవి, బాలయ్య సినిమాలతో పాటు టాక్సిక్ ఆడితే.. మరో మూడేళ్ళు నయన్ కెరీర్‌కు ఢోకా లేనట్లే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కమ్ బ్యాక్ ఇవ్వాలమ్మా.. లేకపోతే చాలా కష్టం

2026లో దండయాత్రే.. కళ్ల ముందు 5 వేల కోట్లు

బాస్‌ – వెంకీల ధాటికి దద్దరిల్లిపోతున్న యూట్యూబ్‌

అప్పుడు దేఖలేదు.. ఇప్పుడు.. ఈ సినిమా గురించే అందరి నోటా మాట

Psych Siddhartha Review: నందు కొత్త స్టైల్ సైక్ సిద్ధార్థ్‌ సినిమా.. హిట్టా..? ఫట్టా..?

Published on: Jan 02, 2026 03:36 PM