ప్రేమ దక్కాలంటే త్యాగం చేయాలి.. అందుకే అతడి కోసం సినిమాలు వదలేయాలని అనుకున్నా..

|

Dec 18, 2024 | 1:14 PM

స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పవర్ ఫుల్ పాత్రలతో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందింది ఈ అందాల భామ. నయన్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆమె సినీ లైఫ్ తో పాటు వ్యక్తిగత విషయాల ద్వారా కూడా వార్తల్లో నిలిచింది. 2011 లో నయన్ సినిమాలకు గుడ్ బై చెప్పాలని అనుకున్న విషయం మీకుతెలుసా.?

అది కూడా తన లవర్‌ కోసం..! ఎస్ ! జీవితంలో ప్రేమ కావాలంటే, కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని గతంలో తాను భావించే దశలో ఉన్నానని… ఆ సమయంలో తాను చాలా సున్నితంగా ఉండేదాన్నంటూ ఆమె చెప్పారు. ప్రేమ కావాలంటే ఎక్కడో ఒకచోట రాజీ పడాల్సిందేనని తనలోని నిజాయితీ గల అమ్మాయి భావించిందని.. అందుకే సినిమాల నుంచి తప్పుకోవాలని తాను అనుకున్నట్టు ఆమె చెప్పారు. ఆ సమయంలో ప్రేమపై తనకున్న అవగాహన అదేనని.. కానీ ఆతర్వాత స్ట్రాంగ్ అయ్యానని తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్టు నయన్ చెప్పారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గతాన్ని గుర్తుకుతెచ్చుకుని స్టేజ్‌పైనే ఏడ్చిన యూట్యూబ్ స్టార్

Dhanush: చంద్రబాబు బయోపిక్‌లో ధనుష్‌