విషయం ఏదైనా.. నేను నీకు తోడుంటా బాబాయ్! మనోజ్‌కు ‘నారా’ వారి అండ
మంచు మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించక సుమారు ఆరేడు అవుతుంది. దీంతో అతని రీ ఎంట్రీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో సినిమాల కంటే తన పర్సనల్ విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు మనోజ్. ఇటీవల అతని కుటుంబంలో చాలా సంఘటనలు జరిగాయి. తండ్రి మోహన్‌బాబు, విష్ణుతో తగాదాలు, పోలీసు కేసులు, కోర్టుల చుట్టూ తిరగడం, ఇలా ఎన్నో కఠిన పరిస్థితులు మధ్య సినిమాను పూర్తి చేశాడు మనోజ్. దీంతో ఆదివారం జరిగిన భైరవం అనే ఈవెంట్ లో మనోజ్ చాలా ఎమోషనల్ అయ్యాడు.
సొంత వాళ్లే దూరం పెట్టే ఈ రోజుల్లో మీరు నన్ను దగ్గర చేసుకొని నాకు ఇంత ప్రేమాభిమానాలను పంచుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎన్నో సంఘటనలు జరిగాయి. ఎన్నో కష్టాలు చూశాను. కట్టుబట్టలతో రోడ్డు మీదకు తెచ్చారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు మంచు మనోజ్. దీంతో అక్కడున్న వారందరూ కొంచెం ఎమోషనల్ అయ్యారు. తోటి హీరోలు మనోజ్‌ను సముదాయించారు. ఇదే క్రమంలో మనోజ్‌ను ఉద్దేశిస్తూ హీరో నారా రోహిత్ ట్విట్టర్ లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఆ ట్వీట్ చూస్తే నెట్టింట తేగవారలు అవుతుంది. భైరవం సినిమాలో మంచు మనోజ్ తో నటించిన నారా రోహిత్ ఏది ఏమైనా మనోజ్ కు తాను అండగా ఉంటానని తన ట్వీట్ లో రాసి పెట్టాడు. అంతేకాదు భైరవం ఈవెంట్ ను సక్సెస్ చేసిన ఏలూరు ప్రాంత వాసులకు ప్రత్యేక ధన్యవాదాలు. మా ఈవెంట్ ను ఎంతో ప్రత్యేకంగా మార్చిన ఏలూరు ప్రజలకు ఋణపడి ఉంటాను.