కాలుని ముద్దుపెట్టుకున్న స్టార్ హీరో అజిత్ వీడియో
ఒకవైపు సినిమాలు, మరోవైపు కారు రేసులతో బిజీ బిజీగా గడుపుతున్నారు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. ఇటీవల అతను నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అలాగే ఈ మధ్యలోనే వివిధ దేశాల్లో జరిగిన కార్ రేసింగ్ లోనూ సత్తా చాటాడు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. సినిమాల్లో స్టార్ హీరో అయినప్పటికీ రియల్ లైఫ్ లో ఎంతో సింపుల్ గా ఉంటాడు అజిత్. తన అభిమాన సంఘాలను కూడా రద్దు చేసిన ఘనత అజిత్ సొంతం.
ఇదిలా ఉంటే ప్రస్తుతం మరో కార్ రేసింగ్ కు రెడీ అవుతున్నాడు అజిత్. ఇందుకోసం ప్రస్తుతం అతను ఇటలీలో పర్యటిస్తున్నాడు. తాజాగా అజిత్ తన అభిమాన కార్ రేసర్ కు నివాళులు అర్పించారు. స్టార్ హీరో అన్న గర్వం లేకుండా ఆయన విగ్రహం పాదాలకు ముద్దు పెట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇంతకు అజిత్ ముద్దు పెట్టింది ఎవరి కాళ్ళకో తెలుసా? ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్ ఆయర్టన్ సెన్నా. బ్రెజిల్ దేశానికి చెందిన ఆయర్టన్ సెన్నా మూడు సార్లు 1988, 1990, 1991 ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్ గా నిలిచాడు. వరుసగా మూడు సార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచిన అతి పిన్న వయసు గల చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
