Nani: తగ్గేదే లే అంటున్న నాని టీమ్‌

Updated on: Oct 18, 2025 | 9:07 PM

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని, తన తాజా చిత్రం ది పారడైజ్ను మార్చి 26న విడుదల చేయనున్నట్లు మరోసారి ధృవీకరించారు. అదే సమయంలో రామ్ చరణ్ పెద్ది కూడా విడుదల కానుండటంతో, బాక్సాఫీస్ వద్ద పెద్ద పోటీ నెలకొననుంది. ఇప్పటికే లాక్ చేసిన తేదీని నాని టీమ్ మార్చడానికి సుముఖంగా లేదు.

నాని ప్రధాన పాత్రలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది పారడైజ్ చిత్రం విడుదల తేదీపై గందరగోళానికి తెరపడింది. రామ్ చరణ్ పెద్ది కూడా అదే సీజన్‌లో విడుదల కానుందని తెలిసినప్పటికీ, నాని టీమ్ తమ నిర్ణయానికి కట్టుబడి ఉంది. ది పారడైజ్ చిత్రం మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు యూనిట్ మరోసారి ధృవీకరించింది. దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. సినిమా అనౌన్స్‌మెంట్ రోజే మార్చి 26న విడుదల తేదీని లాక్ చేసింది యూనిట్. తాజాగా నిర్మాత సుధాకర్ చెరుకూరి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లోనూ ఈ తేదీని స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ ఊరి పేరే దీపావళి.. ఆ గ్రామ ప్రత్యేక ఏంటో తెలుసా ??

అత్తామామలను రెండు పీకి.. కట్‌ చేస్తే.. భర్తను భార్య ఏమి చేసిందంటే

త్వరలో ఆ 4 ప్రభుత్వ బ్యాంకుల విలీనం

ఏటీఎం కేంద్రంలో తిష్టవేసిన ఆంబోతు.. చివరకు..

తేనెటీగలపై మొబైల్ రేడియేషన్ ఎఫెక్ట్.. సమీప భవిష్యత్తులో తేనె అనేదే ఉండదా ??