ప్యారడైజ్ Vs పెద్ది.. ఈ ట్విస్ట్ ఊహించలేదుగా
నాని "ప్యారడైజ్" సినిమా విడుదలపై సస్పెన్స్ నెలకొంది. మార్చి 26న రావాల్సిన ఈ చిత్రం, రామ్ చరణ్ "పెద్ది" (మార్చి 27)తో క్లాష్ అవుతుందేమోనన్న చర్చ జరుగుతోంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి క్లారిటీ ఇస్తూ, "పెద్ది" వస్తే "ప్యారడైజ్" వాయిదా పడుతుందని ప్రకటించారు. సాధారణంగా రిలీజ్ డేట్ విషయంలో పట్టుదలతో ఉండే నాని, ఈసారి క్లాష్ నివారించడానికి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్యారడైజ్ సినిమా వాయిదా పడబోతుందా..? పెద్దితో క్లాష్ నుంచి ప్యారడైజ్ తప్పుకుంటుందా..? చాలా ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైమ్ చెప్పిన డేట్ నుంచి నాని తప్పుకుంటున్నారా..? రామ్ చరణ్ సినిమాతో క్లాష్ వద్దనుకున్నారా లేదంటే నిజంగానే ప్యారడైజ్ ఔట్ పుట్ ఇంకా రెడీ కాలేదా..? అసలేం జరుగుతుంది..? పెద్ది వర్సెస్ ప్యారడైజ్ వెనక అసలు కథేంటి..? నాని చిన్నసైజ్ బాషా టైప్.. ఆయన ఒక్కసారి రిలీజ్ డేట్ చెప్తే 100 సార్లు లాక్ చేసినట్లే. ఆరు నూరైనా అనుకున్న తేదీకి సినిమాను తెచ్చేందుకు అష్టకష్టాలు పడుతుంటారు న్యాచురల్ స్టార్. ప్యారడైజ్ విషయంలోనూ డెడ్ లైన్ పెట్టుకుని పని చేస్తున్నారు టీం. శ్రీకాంత్ ఓదెల దీనికి దర్శకుడు. కానీ ప్యారడైజ్‌కు ఉన్న పెద్ద అడ్డంకి పెద్ది. మార్చి 27న పెద్ది విడుదల కానుంది.. ఆ రోజు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా పెద్ది తీసుకొస్తామని ఏడాది ముందే ప్రకటించారు బుచ్చిబాబు. మరోవైపు మార్చి 26న ప్యారడైజ్ రానుందని ఎప్పట్నుంచో చెప్తూ వస్తుంది SLV సినిమాస్ సంస్థ. ఒక్కరోజు గ్యాప్‌లో నాని, చరణ్ వస్తే కచ్చితంగా ఇద్దరికీ సమస్య తప్పదు. పెద్ది, ప్యారడైజ్ క్లాష్ మీదే తాజాగా నిర్మాత సుధాకర్ చెరుకూరి క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ పెద్ది మార్చి 27న వస్తే తమ సినిమాను వాయిదా వేసుకుంటామని తెలిపారు. పెద్ది వస్తే ప్యారడైజ్ రాదని కుండ బద్ధలు కొట్టేసారు SLV సినిమాస్ అధినేత. అది రాకపోతే ఇది వస్తుందని కన్ఫర్మ్ చేసారు. మరోవైపు పెద్ది మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం డేట్ త్యాగం చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. పెద్ది, ప్యారడైజ్‌లలో ఎవరో ఒకరు వస్తారని నమ్ముతున్నారు ఫ్యాన్స్. కానీ చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చు.. ఒకవేళ ఉస్తాద్ మార్చి 27న వస్తే.. ఎప్రిల్ 30న పెద్దిని విడుదల చేస్తారనే టాక్ నడుస్తుంది. ఎలా చూసుకున్నా ఒకే రోజు గ్యాప్‌లో రెండు సినిమాలైతే రావు.. ఆ క్లాష్ అయితే ఉండదు. వస్తే పెద్ది.. లేదంటే ప్యారడైజ్.. అదీ కాదంటే ఉస్తాద్.. ఏదో ఒక్కటే మార్చి లాస్ట్ వీక్‌లో విడుదల కానుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మాకు మేమే.. మాతో మేమే అంటున్న కుర్ర హీరోలు
రూ. 6 వేల నుంచి రూ.10 వేలు !! బడ్జెట్‌లో రైతులకు సాయం పెరగనుందా ??
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
మేడారంలో ఏఐ డ్రోన్స్‌తో అణువణువు నిఘా.. పిల్లల చేతికి క్యూఆర్ కోడ్ బ్యాండ్స్