Akhanda 2: బాలయ్య ముందు ముచ్చటగా 3 టార్గెట్స్

Edited By: Phani CH

Updated on: Dec 04, 2025 | 4:55 PM

అఖండ 2 చిత్రంతో బాలయ్య ముందు భారీ సవాళ్లు ఉన్నాయి. పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టడం, డే 1 బాక్సాఫీస్ వసూళ్లలో కొత్త రికార్డు నెలకొల్పడం ఆయన ప్రధాన లక్ష్యాలు. సీనియర్ హీరోగా ఈ ఛాలెంజ్‌లను బాలయ్య ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. బోయపాటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం, సనాతన ధర్మం నేపథ్యంతో, ఈ సవాళ్లను అధిగమించేందుకు సిద్ధమవుతోంది.

బాలయ్య ముందు సవాళ్లు చాలా ఉన్నాయి. ఒకటి రెండు కాదు.. ఒకేసారి మూడు నాలుగు ఛాలెంజ్‌లను బాలయ్య యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అవన్నీ అఖండ 2తోనే పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు ఈ సీనియర్ హీరో. మరి బాలయ్యను ముందున్న ఆ సవాళ్లేంటి.. ఆ ఛాలెంజెస్ కోసం ఆయనెలా సిద్ధమవుతున్నారు..? అఖండ 2కు అంతా సిద్ధమైపోయింది.. మరో రెండు రోజుల్లో థియేటర్లలో తాండవం ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు బాలయ్య. ఆయనే సూపర్ ఫామ్‌లో ఉన్నారంటే.. ఆయనకు తోడు బోయపాటి కూడా ఉండటం.. అఖండకు సీక్వెల్ కావడంతో బాక్సాఫీస్ ఈసారి గట్టిగానే మోగిపోయేలా కనిపిస్తుంది. కాకపోతే ఈ సినిమాతో బాలయ్య ముందు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. అఖండ 2తో బాలయ్య ముందున్న మొదటి సవాల్ ప్యాన్ ఇండియన్ మార్కెట్. సీనియర్ హీరోలలో ఈ మార్కెట్ ఎవరికీ లేదు.. సైరాతో చిరంజీవి ట్రై చేసినా వర్కవుట్ కాలేదు. దాంతో ఆయన మళ్లీ రీజినల్ సినిమాలతో బిజీ అయ్యారు. వచ్చే ఏడాది విశ్వంభరతో మరోసారి లక్ టెస్ట్ చేసుకోబోతున్నారు. అఖండ 2తో బాలయ్య తొలిసారి ప్యాన్ ఇండియా వైపు అడుగులేస్తున్నారు. ఇప్పటికే ముంబైలో ఈవెంట్.. యుపీ సిఎం యోగి ఆదిత్యనాథ్‌తో మీటింగ్ ఇవన్నీ నార్త్‌లో అఖండ 2పై ఆసక్తి బాగానే పెంచేసాయి. పైగా సనాతన ధర్మం అనే పాయింట్ ఈ సినిమాకు బలం. ఇక రెండో ఛాలెంజ్.. సీనియర్ హీరోలలో డే 1 రికార్డ్ కొట్టడం. ప్రస్తుతం ఇది సైరా నరసింహారెడ్డి పేరు మీదుంది. 2019లో విడుదలైన సైరా.. తొలిరోజు 85 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఆ తర్వాత 56 కోట్లతో డాకూ మహారాజ్ రెండో స్థానంలో ఉంది. వీరసింహారెడ్డి తొలిరోజే 54 కోట్లు వసూలు చేసింది. తాజాగా అఖండ 2తో 100 కోట్ల ఓపెనింగ్ తేవాలని చూస్తున్నారు బాలయ్య.. అదే జరిగితే అద్భుతమే. చూడాలిక.. బాలయ్య ఈ సవాళ్లన్నీ పూర్తి చేస్తారా లేదా అని..!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Akhanda 2: బాలయ్యకు గుడ్‌ న్యూస్ ఏపీలో బెనిఫిట్ షోలకు ఆ ధరకు గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో?

‘ఆ టాలీవుడ్ హీరో భార్య నుంచి రక్షించండి’ పోలీస్‌ స్టేషన్‌కు శేఖర్ బాషా!

సామ్‌ లాగే ‘భూత శుద్ది వివాహం’ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా ??

హైద్రాబాద్‌లో మరో ఫిల్మ్ సిటీ.. దానికంటే పెద్దగా ఉండబోతుందా

Avatar 3: జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్ 3 గ్రాండ్‌ రిలీజ్‌.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలే

Published on: Dec 04, 2025 04:51 PM