Nandamuri Balakrishna: బాలయ్య ముందు బిగ్ టార్గెట్‌.. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో నయా రికార్డ్‌

Updated on: Dec 02, 2025 | 6:26 PM

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ గణాంకాలు పరిశ్రమను షాక్‌కు గురిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ₹100 కోట్లు, పాన్-ఇండియా స్థాయిలో ₹120 కోట్లకు పైగా వ్యాపారం జరగడంతో, ఈ చిత్రం బ్రేక్-ఈవెన్ కావాలంటే కనీసం ₹200 కోట్లు వసూలు చేయాలి. ఇది బాలయ్యకు పెద్ద సవాల్ అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అఖండ తాండవం టూ. డిసెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. బాలయ్య కెరీర్‌లో మున్నెన్నడూ లేని స్థాయిలో ఈ చిత్రం వ్యాపారం చేసింది. బాలకృష్ణ వరుస బ్లాక్ బస్టర్‌లతో సూపర్ ఫామ్‌లో ఉండటం, బోయపాటితో ఆయన కాంబినేషన్‌కు భారీ అంచనాలు ఉండటం, అలాగే అఖండ మొదటి భాగం పెద్ద హిట్ కావడంతో సీక్వెల్ పట్ల అంచనాలు పెరిగాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. దీనితో మీ సామాన్లు భద్రం

ఆధార్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆ పని ఇంటినుంచే చేయచ్చు

లింగభైరవి దేవి అంతశక్తిగల దైవమా.. ఈ అమ్మ అనుగ్రహం పొందితే..

జామ్ జామ్ గా.. భుజాలపై కోతిని ఎక్కించుకుని బైక్ రైడ్.. మస్త్ ఫీల్ ఉందంటున్న బుచ్చిరాములు

Varanasi: వారణాసి సినిమా షూట్‌కు బ్రేక్.. కారణం..