Naga Vamsi: బుక్‌మైషో బండారం బయటపెట్టిన నాగ వంశీ..

Updated on: Jul 11, 2026 | 3:02 PM

నిర్మాత నాగ వంశీ బుక్‌మైషో కన్వీనియన్స్ ఫీజుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులు చెల్లించే కన్వీనియన్స్ ఫీజులో సగం మొత్తం థియేటర్లకే వెళ్తోందని, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు అందులో వాటా లేదని ఆరోపించారు. అలాగే థియేటర్లలో కలెక్షన్ల పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతూ, బుక్‌మైషో ప్రమోషన్లు, రేటింగ్స్ వ్యవస్థపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

మొహమాటం లేకుండా.. దాపరికాలు అసలే లేకుండా అడిగిన ప్రశ్నకు కుండబద్దలు కొట్టినట్టు సమాధానం చెప్పే నాగ వంశీ.. తన రీసెంట్ ఇంటర్వ్యూలోనూ అదే చేశారు. ఆన్ లైన్ టికెటింగ్ ప్లాట్ పాం బుక్ మై షో గురించి.. బుక్ మై షో వసూలు చేస్తున్న కన్వీనియన్స్ ఫీ గురించి ఒక పెద్ద వివరణ ఇచ్చారు. థియేటర్లలో పర్సంటేజ్ సిస్టమ్ వివాదంపై మాట్లాడుతూ, బుక్ మై షో వెనుక జరుగుతున్న ఒక పెద్ద లూప్‌హోల్‌ను ఆయన బయటపెట్టారు. సూర్యదేవర నాగవంశీ తన తాజా ఇంటర్వ్యూలో బుక్ మై షో.. అందులో వసూలు చేసే కన్వీనియన్స్ ఫీజ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులు ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు బుక్ మై షో వసూలు చేసే కన్వీనియన్స్ ఫీజులో దాదాపు సగం వాటా అంటే 50% నేరుగా థియేటర్ ఓనర్ల జేబుల్లోకి వెళ్తోంది అని చెప్పారు. సినిమాను నిర్మించే ప్రొడ్యూసర్లకు, దానిని నమ్ముకుని కొనే డిస్ట్రిబ్యూటర్లకు ఈ కన్వీనియన్స్ ఫీజులో ఎలాంటి వాటా దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్ యాజమాన్యాలు కన్వీనియన్స్ ఫీజు ద్వారా ఇంత పెద్ద మొత్తంలో అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నప్పుడు, ఆ ఆదాయంలో కచ్చితంగా డిస్ట్రిబ్యూటర్ లేదా నిర్మాతకు కూడా షేర్ ఇవ్వాలని నాగవంశీ డిమాండ్ చేశారు.ఒకవైపు కన్వీనియన్స్ ఫీజుల ద్వారా థియేటర్లు సంపాదిస్తూ, మరోవైపు కలెక్షన్లలో పారదర్శకత లేకుండా ప్రొడ్యూసర్లను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో తాము కొన్ని థియేటర్లలో జరిగిన కలెక్షన్ల ఫ్రాడ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని కూడా వెల్లడించారు. బుక్ మై షో వ్యాపార తీరుపై నాగవంశీ గతంలోనే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున మండిపడ్డారు. బుక్ మై షో ప్లాట్‌ఫారమ్‌లో కనిపించే లైక్స్, హైప్, రేటింగ్స్ అన్నీ నిర్మాతలు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నవే అని ఓపెన్‌గా ఒప్పుకున్నారు.పీఆర్వోల ఒత్తిడి వల్లో, లేదా పక్క హీరోల సినిమాల కంటే తమ సినిమాకు లైక్స్ తక్కువ ఉంటే ఫ్యాన్స్ తిడతారనే భయంతోనో నిర్మాతలు లక్షల రూపాయలు పెట్టి ఈ రేటింగ్స్ కొంటున్నారని చెప్పారు.మనం సినిమాలు తీసి వాళ్ల సైట్‌లో పెడితేనే బుక్ మై షో నడుస్తుంది. వాడు ఆల్రెడీ ప్రతి టికెట్ మీద కమిషన్ తింటూ, మళ్లీ ప్రమోషన్స్ పేరుతో నిర్మాతల దగ్గరే డబ్బులు గుంజడం ఏంటి?” అని ప్రశ్నించారు. అందుకే గిల్డ్ తరఫున బుక్ మై షోకి పెయిడ్ ప్రమోషన్లు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ నాగ వంశీ చెప్పుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బిగ్ స్క్రీన్ మీద బిగ్ చేంజ్‌… ఆడియన్స్‌ టేస్ట్ మారుతోందా..?

Follow Us