Naga Chaitanya: ‘వృషకర్మ’తో చైతూ కొత్త రికార్డు.. విడుదలకే ముందే బిజినెస్ బ్లాస్ట్..!

Edited By:

Updated on: Jul 18, 2026 | 5:46 PM

'తండేల్' విజయంతో మార్కెట్‌ను పెంచుకున్న నాగ చైతన్య, ఇప్పుడు 'వృషకర్మ'తో మరో రికార్డు దిశగా దూసుకెళ్తున్నారు. డిజిటల్, శాటిలైట్, హిందీ హక్కులు కలిపి దాదాపు రూ.50 కోట్ల నాన్-థియేట్రికల్ బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ విడుదలకు సిద్ధమవుతుండగా, విడుదలకు ముందే భారీ అంచనాలు సొంతం చేసుకుంది.

తండేల్ తర్వాత నాగ చైతన్య మార్కెట్ పెరిగిందా..? కేవలం నాన్-థియేట్రికల్ బిజినెస్‌తోనే ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నారా..? వృషకర్మ బిజినెస్ గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుందా..? విడుదలకు ముందే ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయిందా..? అసలు వృషకర్మ బిజినెస్ డీటైల్స్ ఏంటి..? సినిమా ఎప్పుడు రానుంది..? తండేల్‌తో కెరీర్‌లో తొలిసారి 100 కోట్ల మార్క్ అందుకున్న నాగ చైతన్య.. ప్రస్తుతం వృషకర్మతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నాన్-థియేట్రికల్ బిజినెస్‌తోనే చైతూ కెరీర్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. డిజిటల్, శాటిలైట్, హిందీ హక్కులను ప్రముఖ సంస్థ జీ దాదాపు 50 కోట్ల రూపాయలకు తీసుకుంది. నాగ చైతన్య కెరీర్‌లోనే ఇది హైయ్యస్ట్ నాన్-థియేట్రికల్ బిజినెస్. విరూపాక్ష వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. లెక్కల మాస్టర్ సుకుమార్ కూడా నిర్మాణంలో భాగస్వామి కావడం ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. తండేల్ తర్వాత తన కెరీర్‌ను మరింత పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్న చైతూ.. వృషకర్మ కథపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. అభిమానులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నారు సినిమాను డిజైన్ చేస్తున్నారు దర్శకుడు కార్తీక్ దండు. అన్నీ అనుకున్నట్లు జరిగితే అక్టోబర్‌లో వృషకర్మ విడుదల కానుంది. ఇప్పటికే నాన్-థియేట్రికల్ బిజినెస్ పరంగా చైతూ కెరీర్‌లో రికార్డులు తిరగరాసిన వృషకర్మ… రేపు థియేటర్లలో కూడా సేమ్ మ్యాజిక్ చేస్తుందని చాలా నమ్మకంగా కనిపిస్తున్నారు మేకర్స్. మరి చూడాలిక.. వృషకర్మతో చైతూ ఎలాంటి సర్‌ప్రైజులు ఇవ్వబోతున్నారో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Paradise: ‘ది ప్యారడైజ్’పై రూ.110 కోట్ల రూమర్స్… మేకర్స్ ఇచ్చిన క్లారిటీ ఇదే..!

Akhil Akkineni: ‘లెనిన్’తో మారిన అఖిల్… ఇప్పుడు మొదలైంది అసలైన 2.0 జర్నీ..!

ఒక్క సినిమాలో ఐదుగురు హీరోయిన్లు… గ్లోబల్ మూవీస్ కొత్త ఫార్ములా..!

చిన్న సినిమాల నుంచి వందల కోట్ల సీక్వెల్స్… బ్లాక్‌బస్టర్ల కొత్త లెక్కలు..!

Yash: యష్ డబుల్ స్పీడ్.. వరుస పాన్ ఇండియా సినిమాలతో భారీ ప్లాన్..!

Published on: Jul 18, 2026 05:45 PM
Follow Us