Dootha 2: చైతూ రెండూ ఒకేసారి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారబ్బా..?
వెబ్ సిరీస్‌ల వైపు స్టార్ హీరోలు పెద్దగా ఆసక్తి చూపని సమయంలో నాగ చైతన్య కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. ‘దూత’ తొలి సీజన్ విజయంతో ఇప్పుడు ‘దూత 2’కు శ్రీకారం చుట్టారు. జర్నలిజం బ్యాక్‌డ్రాప్ నుంచి ఈసారి మెడికల్ మాఫియా కథాంశాన్ని ఎంచుకున్న దర్శకుడు విక్రమ్ కె కుమార్, మరింత భారీ స్థాయిలో సీజన్‌ను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు.
వెబ్ సిరీస్‌లు చేయడం అనేదే మన హీరోల కాన్సెప్ట్ కాదు.. ఏదో చిన్న హీరోలు డిజిటల్ వైపు వెళ్తుంటారేమో కానీ మెయిన్ స్ట్రీమ్ హీరోలైతే వెబ్ సిరీస్‌ల వైపు చూసిందే లేదు. ఈ ట్రెండ్‌కు నాగ చైతన్య ఫస్ట్ టైమ్ తెర తీసారు. ఇకపై కూడా ఇదే దారిలో వెళ్తున్నారు కూడా.. తాజాగా దూత 2 మొదలైంది. ఓవైపు సినిమాలు.. మరోవైపు సిరీస్‌లు చైతూ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు..? మన హీరోలు సినిమాలు తప్ప వెబ్ సిరీస్‌ల గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. బాలీవుడ్‌లో అంటే స్టార్ హీరోలు కూడా డిజిటల్‌లోకి వస్తున్నారు కానీ మన దగ్గర ఇంకా ఆ ట్రెండ్ రాలేదు. ఉన్నంతలో మొదటి అడుగు దూత సిరీస్‌తో నాగ చైతన్య వేసారు. అది సూపర్ సక్సెస్ అయింది. తాజాగా దూత 2 కూడా ఓపెన్ అయింది.. నాగ్ చేతుల మీదుగా దీనికి కొబ్బరికాయ్ కొట్టారు. చైతూ ప్రస్తుతం కార్తిక్ దండు దర్శకత్వంలో వృషకర్మ సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఇది సెట్స్‌పై ఉండగానే తాజాగా దూత 2 సిరీస్ ఓపెన్ చేసారు చైతూ. తొలి సీజన్ జర్నలిజం బ్యాక్‌డ్రాప్‌లో నడిస్తే.. ఈసారి మెడికల్ మాఫియాను ఎంచుకున్నారు దర్శకుడు విక్రమ్ కే కుమార్. వరస సినిమాలు చేస్తూనే.. మరోవైపు డిజిటల్ కూడా కవర్ చేస్తున్నారు నాగ చైతన్య. దూత 2 సిరీస్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. సీజన్ 1 పెద్ద హిట్ అవ్వడంతో.. సీజన్ 2ను ఇంకా భారీగా ప్లాన్ చేస్తున్నారు. దూత 2 కూడా సక్సెస్ అయితే.. మరికొందరు హీరోల చూపులు వెబ్ సిరీస్‌ల వైపు వెళ్ళడం ఖాయం. ప్రియా భవానీ శంకర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీటి చుక్క దొరక్క ఎడారిలో 49 మంది మృతి
అండమాన్‌లో మరో భారీ గ్యాస్ నిక్షేపం.. భారత్ ఇంధన భవిష్యత్తుకు కొత్త ఆశలు
Yash: ముంబై బీచ్‌లో రూ. 24 కోట్ల ప్రాపర్టీ కొన్న యశ్!
బంగారం పెట్టుబడిదారులకు బిగ్ షాక్.. గోల్డ్ ఫండ్స్‌పై కొత్త రూల్స్..!