Renuka Swamy: దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..

|

Oct 31, 2024 | 8:08 AM

రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడైన హీరో దర్శన్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. నటుడికి అనారోగ్య సమస్యలున్నందన కర్ణాటక హైకోర్టు ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఆదేశాలతో సహజంగానే దర్శన్ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తోంది. అయితే మరోవైపు రేణుకా స్వామి కుటుంబం మాత్రం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

దర్శన్‌ కు మధ్యంతర బెయిల్ మంజూరవడంలో.. తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన రేణుకా స్వామి తండ్రి.. ఇది పూర్తిగా న్యాయ పరమైన చర్య అని.. కోర్టు ఇచ్చిన ఆదేశమన్నారు. అయితే ఇది తనకు తన కుంటుంబానికి కొంత బాధ కలిగించిదన్నారు. అంతేకాదు న్యాయ ప్రక్రియను, కోర్టు ఆదేశాలను గౌరవిస్తాం అన్నారాయన ఇక తమ కుటుంబానికి అన్యాయం జరిగిందని.. దోషులను శిక్షించే వరకు తమ న్యాయ పోరాటం మాత్రం ఆగకుండా కొనసాగుతుంది అంటూ కాస్త గట్టిగా చెప్పారు రేణుకా స్వామి తండ్రి కాశీ విశ్వనాథ్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.