మాకు మేమే.. మాతో మేమే అంటున్న కుర్ర హీరోలు

Edited By:

Updated on: Jan 22, 2026 | 3:54 PM

తెలుగు హీరోలు కేవలం నటనకే పరిమితం కాకుండా, తమ కెరీర్‌ను తామే తీర్చిదిద్దుకుంటున్నారు. కథలు, స్క్రీన్ ప్లే, మాటలు రాస్తూ ఆల్ రౌండర్స్‌గా మారుతున్నారు. నవీన్ పొలిశెట్టి, అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ వంటి వారు సొంత కథలతో విజయాలు సాధిస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది కేవలం నటనకు మించి, సినిమా నిర్మాణంలో బహుముఖ ప్రతిభను చాటుకుంటున్న కొత్త ట్రెండ్.

హీరోలు కేవలం నటనపైనే ఫోకస్ చేయాలి.. దర్శకులు డైరెక్షన్ మాత్రమే చేయాలి అనుకునే రోజులు కావివి. అందరూ అన్నీ చేస్తున్నారు.. అందులో మన హీరోలు కూడా ఉన్నారు. ఇన్నాళ్లూ కేవలం నటనపైనే ఫోకస్ చేసిన వాళ్లు ఇప్పుడు పెన్ను పడుతున్నారు.. నచ్చింది రాస్తున్నారు.. స్క్రీన్ మీదకు తీసుకొస్తున్నారు.. ఆల్ రౌండర్స్ అనిపించుకుంటున్నారు. ఎవరో రావాలి.. మనకేదో చేయాలి.. మన కెరీర్‌ను పైకి తీసుకురావాలి అని ఎదురు చూసే రోజులు పోయాయి. వాళ్ల కెరీర్‌ను వాళ్లే లిఫ్ట్ చేసుకుంటున్నారు మన హీరోలు. కథలు వాళ్లే రాసుకుంటున్నారు.. స్క్రీన్ ప్లే, మాటలు కూడా వాళ్లే రాసుకుంటున్నారు.. కుదిర్తే పాటలు కూడా రాసేస్తున్నారు. మొన్నామధ్య ఆంధ్రా కింగ్ తాలూకలో రామ్ ఓ పాట రాసి, మరో పాట పాడారు కూడా. ఐ లవ్ యూ అనే పదాలు వాడకుండా ప్రేమ గురించి వివరిస్తూ తనలోని లిరిసిస్ట్‌ను బయటికి తెచ్చారు రామ్. ఆ లైలాలో ఓ పాట రాసారు విశ్వక్ సేన్. కేవలం పాటలు మాత్రమే కాదు.. ఇంకా చాలా చేస్తున్నారు మన హీరోలు. డాన్సులు, ఫైట్లు, యాక్టింగ్ మాత్రమే కాదు.. మిగిలిన డిపార్ట్‌మెంట్స్‌లో అడుగేస్తున్నారు. తాజాగా అనగనగా ఒకరాజు సక్సెస్ క్రెడిట్ అంతా నవీన్ పొలిశెట్టికే సొంతం. మూడేళ్లుగా సెట్స్‌పైనే ఉన్న అనగనగా ఒకరాజును ముందుండి నడిపించారు నవీన్. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు రాసింది ఆయనే. ప్రమోషన్స్ కొత్తగా ప్లాన్ చేసారు.. అన్నీ కలిసి సంక్రాంతికి సినిమా దుమ్ము రేపింది. ఈ లిస్టులో అడివి శేష్ కూడా ఉన్నారు. డెకాయిట్, గూఢచారి 2 సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నది శేష్ బాబే. సిద్ధూ జొన్నలగడ్డ గురించి ఏం చెప్పాలి..? టిల్లు క్యారెక్టర్ ఈయన బుర్రలోంచి వచ్చిందే. కెరీర్ కష్టాల్లో ఉన్నపుడు ఎవరి కోసం వేచి చూడకుండా.. డిజే టిల్లుతో సిద్ధూ.. ఏజెంట్ ఆత్రేయతో నవీన్ పొలిశెట్టి.. క్షణంతో అడివి శేష్.. ఎస్ఆర్ కళ్యాణమండపంతో కిరణ్ అబ్బవరం నిలబడింది వాళ్ల సొంత కథలతోనే..! అందుకే మన కుర్రాళ్లను ఆల్‌రౌండర్స్ అనేది..!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ. 6 వేల నుంచి రూ.10 వేలు !! బడ్జెట్‌లో రైతులకు సాయం పెరగనుందా ??

కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు

ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్‌ వైర్లను లెక్కచేయని తల్లి

మేడారంలో ఏఐ డ్రోన్స్‌తో అణువణువు నిఘా.. పిల్లల చేతికి క్యూఆర్‌ కోడ్‌ బ్యాండ్స్‌

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 15 లక్షల వరకు నో ట్యాక్స్‌ ??